టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మ్యాచ్ విన్నర్ ఔట్! ఆ ఢిల్లీ ఆటగాడికి చోటు!
ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ గాయంతో జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో వరుణ్ చక్రవర్తీకి గాయమైందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే వరుణ్ చక్రవర్తీకి గాయమైందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. పక్కటెముకల భాగంలో నొప్పితో అతను రెండో టీ20కి దూరంగా ఉన్నాడు.
ఇటీవలే తొడ కండరాల గాయం నుంచి కోలుకొని అఫ్గాన్‌తో సిరీస్‌లోనే బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తీ.. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి మళ్లీ గాయపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో అతనికి గాయం కాగా రెండు నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతలోనే మళ్లీ గాయపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండానే ఆడించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత గాయంతో వరుణ్ చక్రవర్తీ ఆసియా గేమ్స్ మొత్తానికి దూరం కానున్నాడు.

అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే వరుణ్ చక్రవర్తీ గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఆసియా గేమ్స్ కోసం భారత్ జపాన్‌కు వెళ్లనుంది. తాజా గాయంతో అఫ్గాన్‌తో గురువారం జరిగే ఆఖరి టీ20 మ్యాచ్‌కు కూడా వరుణ్ చక్రవర్తీ దూరం కానున్నాడు.
ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్ పర్యటనలో వరుణ్ చక్రవర్తీకి గ్రేడ్ 2 తొడకండరాల గాయమైంది. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో మైదానంలోకి అడుగుపెట్టాడు. అనంతరం బీసీసీఐ సీఓఈలో రిహాబిలిటేషన్ కూడా తీసుకున్నాడు.
టీఎన్‌పీఎల్‌లో ఒక మ్యాచ్ ఆడిన అతను ఒక్క వికెట్ తీయకపోగా.. 34 పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ అఫ్గాన్‌తో తొలి టీ20లో మెరుగైన ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. పక్కటెముకల భాగంలో నొప్పితో రెండో టీ20కి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


