Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ సెమీ పైనల్స్ సందర్భంగా ఈస్ట్ జోన్ జట్టుకు ఊహించని రీతిలో ఓ అరుదైన సన్నివేశం ఎదురైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ గాయపడటంతో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తుండగా గాయం కారణంగా మైదానం వీడవలసి వచ్చింది. ఆ సంఘటనతో 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ఓ సీనియర్ దేశీయ క్రికెట్ మ్యాచ్‌కు కెప్టెన్ అయ్యాడు. ఇషాన్ గాయం కారణంగా స్టేడియం విడిచివెళ్లడంతో తాత్కాలికంగా వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.
ఈస్ట్ జోన్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అభిజిత్ సర్కార్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతుల్లో ఒకటి ఇషాన్ కిషన్ బొటనవేలికి తగిలింది. ఒక ఫిజియో మైదానంలోకి వచ్చాడు, కానీ అక్కడి పరిస్థితుల కారణంగా ఇషాన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇషాన్ తన బొటనవేలికి ఐస్ పెట్టుకోవడానికి మైదానం విడిచి వెళ్ళినప్పుడు జార్ఖండ్‌కు చెందిన కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు. ఇషాన్ జట్టుకు దూరమవ్వడంతో వైభవ్ సూర్యవంశి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఎందుకంటే వైభవ్ సూర్యవంశి అప్పటికే ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు కేవలం తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తర్వాత వైభవ్ సూర్యవంశి తన దేశీయ క్రికెట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. ఈస్ట్ జోన్ విషయానికి వస్తే వారి జట్టులో 30 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు . అతను 114 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉన్నాడు. అతని అనుభవం ఉన్నప్పటికీ సెలెక్టర్లు వైభవ్‌ను వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఫలితంగా దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో వైభవ్ ఇప్పుడు ఈస్ట్ జోన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇషాన్ కిషన్ స్టేడియంలోకి అడుగుపెట్టిన వెంటనే వైభవ్ మళ్లీ వైస్-కెప్టెన్ పాత్రలోకి మారతాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో 15 ఏళ్ల కుర్రాడు కెప్టెన్సీ చేయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో కేవలం 215 పరుగులు మాత్రమే చేసిన వైభవ్.. ఇప్పుడు సెమీ-ఫైనల్‌లో సెంట్రల్ జోన్‌పై ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

