గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!
ఆదివారం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 88వ 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమంలో ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద కూతురు ఆజీన్ గంభీర్‌ను 'ఫిట్ ఇండియా అంబాసిడర్'గా సత్కరించారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆజీన్ తండ్రి గంభీర్ కూడా హాజరయ్యారు, ఇది ఆయనకు ఎంతో భావోద్వేగభరితమైన క్షణంగా మిగిలింది.
ఫిట్‌నెస్, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించే ప్రచారంలో యువతను భాగస్వాములను చేయడమే 12 ఏళ్ల అజీన్ గంభీర్‌ను ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా గౌరవించడం వెనుక ఉన్న లక్ష్యం. 'సండేస్ ఆన్ సైకిల్' వంటి కార్యక్రమాలు ప్రజలను సైకిల్ తొక్కడానికి, క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తాయి. గౌతమ్ గంభీర్ కూతురికి లభించిన ఈ గౌరవం చాలా ప్రత్యేకం. ఎందుకంటే గంభీర్ స్వయంగా ఫిట్‌నెస్, క్రమశిక్షణతో కూడిన కెరీర్‌ను గడిపిన భారత క్రికెటర్లలో ఒకరు. గంభీర్ కోచింగ్ కింద ఈ ఏడాది భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోగా.. గతేడాది టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు సైక్లింగ్ ద్వారా ఫిట్‌నెస్ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు భారీగా ప్రజలు పాల్గొన్నారు. సైకిల్ తొక్కడం ద్వారా ప్రజలకు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో శారీరక కార్యకలాపాలను భాగం చేసుకోవాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఆదివారం ఉదయం ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి సైకిల్ తొక్కడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉండేలా ప్రోత్సహించడమే ఈ ప్రచారం లక్ష్యం.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చొరవతో "సండేస్ ఆన్ ఎ సైకిల్" డిసెంబర్ 2024లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రచారం ఫిట్‌నెస్‌ను ఓ సామూహిక ఉద్యమంగా మార్చడంపై, ప్రజలను వారి దైనందిన జీవితంలో శారీరక కార్యకలాపాలను చేర్చుకునేలా ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.
గౌతమ్ గంభీర్ కుటుంబం
గౌతమ్ గంభీర్ 2011 అక్టోబర్ 28న గురుగ్రామ్‌లో నటాషా జైన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి 2014 మే 1న ఆజీన్ అనే కుమార్తె జన్మించింది. వారి రెండో కుమార్తె అనైజా 2017లో జన్మించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

