Asia Cup 2026: తొలి మ్యాచ్‌లో బోణి.. యూఏఈని చిత్తు చేసిన శ్రీలంక!
Asia Cup 2026: మహిళల టీ20 ఆసియా కప్ 2026 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఘన విజయంతో శుభారంభం చేసింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన ఈ ఏకపక్ష పోరులో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఆతిథ్య యూఏఈ జట్టును చిత్తు చేసింది. ఈ భారీ విజయంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక కీలకమైన పాయింట్లను సాధించడమే కాకుండా రన్ రేట్ ను కూడా భారీగా మెరుగుపరుచుకుంది.
79 పరుగులకే యూఏఈ ఆలౌట్
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. శ్రీలంక బౌలర్ల ధాటికి నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన యూఏఈ.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కెప్టెన్ ఇషా ఓఝా చేసిన 18 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధిక స్కోరు కావడం గమనార్హం. శ్రీలంక బౌలర్లు మిథాలీ అయోధ్య, అలుత్ విముక్తి అత్యుత్తమ బౌలింగ్ తో కట్టుదిట్టం చేయడంతో యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 79 పరుగులకే కుప్పకూలింది.

శ్రీలంక కెప్టెన్ తుఫాన్ ఇన్నింగ్స్
80 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కెప్టెన్ చమరి ఆటపట్టు, ఇమేషా దులానీ మొదటి వికెట్ కు కేవలం 5.2 ఓవర్లలోనే 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని ఖాయం చేశారు. చమరి ఆటపట్టు 25 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. ఇమేషా దులానీ 18 బంతుల్లో 25 పరుగులు చేసి రాణించింది. శ్రీలంక కేవలం 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిగిలి ఉన్న బంతుల ఆధారంగా మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతిపెద్ద విజయం.
రాబోయే మ్యాచ్‌ల వివరాలు
ఈ టోర్నీలో ఇరుజట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఇండోనేషియాతో తలపడనున్నాయి. శ్రీలంక జట్టు సెప్టెంబర్ 2న ఇండోనేషియాతో, సెప్టెంబర్ 4న యూఏఈతో ఆడనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు జరుగుతుంది. శ్రీలంక మాదిరిగానే, టీమిండియా కూడా ఈ టోర్నమెంట్‌ను ఒక భారీ విజయంతో ప్రారంభించాలని చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

