
కష్టాల మీద కష్టాలు..
దానిని పూడ్చుకొనేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా.. చివరికి డ్రీమ్ 11కు టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. అయితే వివో చెల్లించే దాంట్లో సగం ధరకే డ్రీమ్11 హక్కులు దక్కించుకుంది. ఇక టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకున్న తరుణంలో బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్‌షిప్ నుంచి 'ఫ్యూచర్ గ్రూప్' తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో బిత్తరపోయిన బోర్డు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అన్ అకాడమీతో ఒప్పందం
ఇక బోర్డు వర్గాల సమాచారం మేరకు టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడ్డ అన్ అకాడమీ సెంట్రల్ స్పాన్సర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరో మూడేళ్ల పాటు స్పాన్సర్‌గా కొనసాగేందుకు రూ. 120-130 కోట్లతో ఈ ఎడ్యూకేషన్ టెక్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ అనే వెబ్‌సైట్ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఓ బీసీసీఐ అధికారి అన్నట్లు తెలిపింది. ‘అన్‌కాడమీతో మూడేళ్ల ఒప్పందం కుదిరింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం'అని సదరు అధికారి పేర్కొన్నారు.

40 శాతం తగ్గిన ఆదాయం..
ఇక ఫ్యూచర్ గ్రూప్ తప్పుకోవడంతో అసోసియేట్ స్పాన్సర్స్ విషయంలో రెండు ఖాళీలు ఏర్పాడ్డాయి. ఇందులో ఒకటి అన్‌అకాడమీ దక్కించుకున్నట్లు తెలుస్తుండా రెండోదాని కోసం బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. క్రెడిట్ కార్డు పేమెంట్ కంపెనీ క్రెడ్‌తో డీల్ కుదుర్చుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ కంపెనీతో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది.
ఇక గతేడాదితో చూస్తే బీసీసీఐ స్పాన్సర్ షిప్ ఆదాయం 40 శాతం తగ్గింది. 2019 సీజన్‌కు స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ. 618 కోట్లు రాగా.. ఈ సీజన్‌కు రూ.360 కోట్లే వస్తుంది. గతేడాది వివోనే టైటిల్ స్పాన్సర్ కింద రూ.440 కోట్లు చెల్లించింది.

యూఏఈకి తరలడమే..
కరోనా కారణంగా యూఏఈకి తరలి పోవడంతో వీటన్నింటిపై ప్రభావం పడింది. అక్కడ ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు కానీ జనం లేకపోతే బ్రాండ్లపై ఎవరి కనీస దృష్టి కూడా పడదు. టీవీలో మ్యాచ్‌ల ప్రసారం వల్ల నేరుగా టీమ్ స్పాన్సర్లకు పెద్దగా లాభం ఉండదు. ఇప్పుడు ఐపీఎల్ సెంట్రల్ పూల్ స్పాన్సర్‌షిప్ నుంచి ప్రముఖ సంస్థ ‘ఫ్యూచర్ గ్రూప్' కూడా ఇదే కారణంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బజార్, ఫుడ్ బజార్ తదితర బ్రాండింగ్‌లు ఉన్న ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఐపీఎల్ సీజన్‌కు రూ. 40 కోట్లు చెల్లించడం భారంగా భావిస్తోంది. ప్రచారం కోసం అంత మొత్తం పెట్టడం అనవసరమని ఫ్యూచర్ గ్రూప్ నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications

పదేళ్ల పాటు ఒక్కపూటే తిన్నా.. అర్జున అవార్డీ సారికా కాలే