Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ను వివాదాస్పద రీతిలో ఔటివ్వడంతో నా పేరు ప్రపంచానికి తెలిసింది: మాజీ అంపైర్

umpire Daryl Harper reveales that he still believes that Sachin Tendulkar’s LBW decision was a correct

న్యూఢిల్లీ: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను వివాదాస్పద రితీలో ఔటివ్వడంతో తన పేరు ప్రపంచానికి తెలిసింది. మాజీ అంపైర్ డారీల్ హార్పర్ తెలిపాడు. 1999లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్ హార్పర్ సచిన్‌ను ఎల్బీగా ఔటివ్వడం వివాదాస్పదమైంది. అయితే ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మెక్‌గ్రాత్ వేసిన బంతి సచిన్ కాళ్లకు కాకుండా, భుజానికి తగిలింది.

ఆ బంతిని బౌన్సర్‌గా భావించిన మాస్టర్.. దాన్ని వదిలేయాలనే ఉద్దేశంతో కిందికి కూర్చున్నాడు. దీంతో బంతి నేరుగా సచిన్ భుజానికి తగిలింది. ఆ సమయంలో ఆసీస్ జట్టు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్‌ చేయగా హార్పర్.. సచిన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ షోల్డర్ బిఫోర్ వికెట్ ఘటనను 'టెండక్కర్' డెసిషన్‌గా క్రికెట్ అభిమానులు పిలుచుకుంటారు.

తిట్టుకున్నా నా పేరు తెలిసింది..

తిట్టుకున్నా నా పేరు తెలిసింది..

ఈ నిర్ణయం తర్వాత ప్రపంచంలో ఆరోవంతు ప్రజలకు తన పేరు పరిచయం అయిందని, అయితే వారంతా తన గురించి గొప్పగా చెప్పుకుంటారని భావించడంలేదని హార్పర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

‘నా జీవితంలో ప్రతీ రోజు ఈ టెండక్కర్ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ చూసుకుంటాను. అయితే ఈ నిర్ణయంతో నిద్రల్లేని రాత్రులు గడిపానని లేక నన్ను వెంటాడుతుందని కాదు. ఎలాంటి భయం, పాక్షపాతం లేకుండా నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ డిసిషన్ పట్ల నేను చాలా గర్వపడుతాను. కానీ చాలా మంది ఈ నిర్ణయంతో నిరాశకు గురయ్యారు. అంపైర్ల శిక్షణ క్యాంప్‌లో ఈ ఖచ్చితమైన డిసిషన్ గురించి ఐసీసీ అధికారులు మాట్లాడుతూ.. ఆ టైమ్‌లో భారత కెప్టెన్‌గా ఉన్న సచిన్ మ్యాచ్ తర్వాత ఈ నిర్ణయంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. అయితే ఈ నిర్ణయంతో ప్రపంచంలోని ఆరో వంతు జనాభాకు నా పేరు తెలిసింది.'హార్పర్ తెలిపాడు.

ఎమ్మెస్కే కూడా..

ఎమ్మెస్కే కూడా..

ఇక సచిన్ కూడా ఔటేనని నమ్మాడని ఆ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్‌గా ఉన్న మాజీ చీఫ్ సెలెక్టెర్ ఎమ్మెస్కే ప్రసాద్ రెండేళ్ల క్రితం చెప్పాడని హార్ఫర్ గుర్తు చేసుకున్నాడు. ‘2018 డిసెంబర్‌లో టీమిండియా సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను భారత్-ఆస్ట్రేలియా అడిలైడ్ టెస్ట్ లంచ్ సమయంలో కలిసాను. 1999 అడిలైడ్ తర్వాత మేం ఒకరికొకరం తారసపడలేదు. చూడగానే హగ్‌తో పలకరించుకున్నాం.

ఎమ్మెస్కే మొదట మాట్లాడుతూ.. ‘సచిన్ తాను ఔటేనని చెప్పాడు. నేను కూడా ఇది అసాధారణమైన ఔటనుకున్నా. ఇలాంటి నిర్ణయం మళ్లీ ఎక్కడా చూడలేదు. కానీ ఇప్పటికీ అది సరైన నిర్ణయమేనని నమ్ముతున్నా'అని తెలిపాడు. అయితే ప్రేక్షకుల అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోగలను. అప్పటి వరకు చూడని అలాంటి నిర్ణయంతో వారు ఆశ్చర్యపోవడంలో తప్పులేదు. నేను కూడా ఆ నిర్ణయంపై చాలా రిసెర్చ్ చేశాను.'అని హార్పర్ చెప్పుకొచ్చాడు.

అంపైరింగ్ ఆస్వాదించా..

అంపైరింగ్ ఆస్వాదించా..

‘ఇక నేను భారత్‌లో 26 టెస్ట్‌లు, 44 వన్డేలకు అంపైరింగ్ చేశా. కానీ సచిన్ ఎప్పుడూ ఆ నిర్ణయం గురించి నాతో చర్చించలేదు. సచిన్, నేను నిబంధనలను ఫాలో అయ్యాం. అప్పీల్ ద్వారానే నేను ఆ నిర్ణయం తీసుకున్నా. క్రికెట్ ఇలానే నడుస్తుంది. ఇదే క్రీడాస్పూర్తి. ఈ విధంగానే అంపైరింగ్‌ను ఆస్వాదించా. ముఖ్యంగా భారత్‌లో మరీ ఎంజాయ్ చేశా'అని హార్పర్ తెలిపాడు.

తిడుతూనే ఉంటారు..

తిడుతూనే ఉంటారు..

ఎల్బీడబ్ల్యూ కాని ఎస్బీడబ్ల్యూ కారణంగా ఇప్పటికీ ఇండియన్ ఫ్యాన్స్ తనను తిడుతూనే ఉంటారని మెక్‌‌గ్రాత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సచిన్‌ను కలిసిన ప్రతీసారి ఈ వివాదస్పద ఔట్‌ను తనకు గుర్తు చేస్తూనే ఉంటాడన్నాడు. ఈ ఘటన అనంతరం తాను చాలా సార్లు స్లెడ్జ్‌కు గురయ్యానని, ముఖ్యంగా సచిన్ ఫ్యాన్స్ పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించేవారని మెక్‌గ్రాత్ గుర్తుచేసుకున్నాడు. కానీ ఇది ఆట పట్ల వారికున్న పిచ్చని, ముఖ్యంగా సచిన్‌పై ఉన్న ప్రేమ అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ చేసి బౌండరీ ఆపడమా.. స్టోక్స్ నీ కమిట్‌మెంట్‌కు సలాం!

Story first published: Tuesday, July 21, 2020, 21:29 [IST]
Other articles published on Jul 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+