Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020!

UAE Cricket Board confirms offer to BCCI for staging IPL 2020 in UAE this year

దుబాయ్: కరోనా పుణ్యమా నిరవధికంగా వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ భారత్ వెలుపల జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15కు వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పరిస్థితులు అదుపులోకి రాకపోవడం నిరవధికంగా వాయిదా వేసింది.

ఇప్పట్లో కష్టమే..

ఇప్పట్లో కష్టమే..

ప్రస్తుతం భారత ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఆదివారం ఉదయానికి దేశంలో వైరస్ బాధితులు సంఖ్య 2,46,622కు చేరింది.కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తుంటే.. ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో.. ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఆతిథ్యం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది.

భారత్‌లో సాధ్యమవుతుందా?

భారత్‌లో సాధ్యమవుతుందా?

భారత్‌లో టోర్నీని నిర్వహిస్తే..? విదేశీ క్రికెటర్లని ఇక్కడికి అనుమతిస్తారా..? టోర్నీలోని 8 టీమ్‌లు మ్యాచ్‌ల కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మార్చిలోనే తమ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిచొద్దంటూ ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

సాధ్యం కాకపోతేనే..

సాధ్యం కాకపోతేనే..

అయితే ఐపీఎల్‌పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సురక్షిత వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యమైతే తమ తొలి ప్రాధాన్యత భారత్‌లోనేనని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ తెలిపారు. పరిస్థితులు అనుకూలించకున్నా, ఈ ఏడాది క్రికెట్‌ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు మరో అవకాశం లేకపోతేనే విదేశాల్లో నిర్వహించేదానిపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా క్రికెట్ బోర్డులు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు.

అవకాశమిస్తే ఆతిథ్యానికి రెడీ

అవకాశమిస్తే ఆతిథ్యానికి రెడీ

అవకాశమిస్తే ఐపీఎల్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) బోర్డు ప్రకటించింది. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐకి ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలను ధ్రువీకరించింది.

‘గతంలో యూఏఈ బోర్డు విజయవంతంగా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించింది. వివిధ దేశాల మధ్య తటస్థ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన చరిత్ర మాకుంది. ఐపీఎల్‌తో పాటు ఇంగ్లండ్ సీజన్ మ్యాచ్‌లూ నిర్వహించేందుకు ఆయా దేశాల బోర్డులకు తెలియజేశాం. మా ప్రతిపాదన అంగీకరిస్తే సంతోషిస్తాం'అని యూఏఈ బోర్డు తెలిపింది. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఆ ఏడాది ఐపీఎల్ జరగగా.. 2014లోనూ యూఏఈ వేదికగా ఫస్ట్ హాఫ్ సీజన్ మ్యాచ్‌లు జరిగాయి.

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్‌ సెహ్వాగ్: లక్ష్మణ్‌

Story first published: Sunday, June 7, 2020, 17:06 [IST]
Other articles published on Jun 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+