
నా తప్పులేదు..
‘ఇలా రెండు సార్లు జరిగింది. చివరకు నేను ఆడిన భారీ ఇన్నింగ్స్( 264) మ్యాచ్‌లో కూడా విరాట్ రనౌట్ అయ్యాడు. బెంగళూరు వేదికగా(ఆస్ట్రేలియా 209) జరిగిన మ్యాచ్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న అతనే బంతిని బౌలర్ వైపు ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. సహజంగా ఆ పరిస్థితుల్లో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఎవరైనా తిరిగి తమని తమను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. నేను కూడా అదే చేశా.. అతనెక్కడున్నాడో చుశా. కానీ కోహ్లీ అక్కడే ఆగిపోయాడు. ఏం చేయలేని పరిస్థితి అది.

అది నా బాధ్యత..
అలాంటి పరిస్థితుల్లో మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అంతకు ముందు మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లోనే సెంచరీ చేసి అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. ఆటపై అంత ప్రేమ ఉన్న ఆటగాళ్లు ఔటైతే ఆ లోటు తీర్చాలి. ఆ మ్యాచ్‌లో శిఖర్ 40 బంతుల్లో 60 చేసి ఔటయ్యాడు. అనంతరం కోహ్లీ సున్నాకే వెనుదిరగాడు. అలాంటి పరిస్థితుల్లో చివరి వరకు ఆడటం నా బాధ్యత.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

మూడో సారి కోహ్లీ లేడు..
ఇక 2013లోనే ఓపెనర్‌గా ఆడటం మొదలు పెట్టిన హిట్ మ్యాన్ ఇప్పటి వరకు మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా రోహిత్ (158 బంతుల్లో 209) తొలి డబుల్ చేయగా.. అందులో కోహ్లీ మూడు బంతులే ఆడి రనౌటై డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక శ్రీలంక మీద ముంబై క్రికెటన్ ఆడిన భారీ ఇన్నింగ్స్ (264) మ్యాచ్‌లో కూడా కోహ్లీ(64 బంత్లుల్లో 60) సమన్వయలోపంతో రనౌటయ్యాడు. లంక మీద మరోసారి చెలరేగిన హిట్ మ్యాన్( 153 బంతుల్లో 208) మోహాలి వేదిక కెప్టెన్‌గా మరో డబుల్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ లేడు. అతను విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్.. సారథిగా జట్టును నడిపించాడు. ఇక ఫ్యాన్స్ మాత్రం కోహ్లీ రనౌట్.. రోహిత్ డబుల్ సెంచరీపై జోకులు పేల్చుతున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ పెద్ద మనసు.. వలస కూలీలకు ఫుడ్ ఫ్యాకెట్స్ అందిస్తున్న యువ క్రికెటర్


Click it and Unblock the Notifications
