Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరే.. మీకు సిగ్గు, శరం ఉందా?.. #VirushkaDivorce ట్యాగ్ ట్రెండింగ్‌పై నెటిజన్ల ఫైర్!

Twitterati comes up with hilarious responses to shun fake news over #VirushkaDivorce trends
#VirushkaDivorce: Hilarious Memes

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా అసత్యవార్తల ప్రచారం ఎక్కువైంది. నిజ నిజాలతో సంబంధంలేకుండా కొంతమంది ఆకతాయిలు, ఫేక్ వెబ్‌సైట్స్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ అంటూ #Dhoniretires హాష్ ట్యాగ్ ట్రెండ్ చేసి అతని సతీమణి సాక్షిసింగ్ ఆగ్రహానికి గురయ్యారు.

మరో ఫేక్ న్యూస్

మరో ఫేక్ న్యూస్

కేరళలో ఏనుగు మరణ ఉదంతంపై తప్పుడు సమాచారంతో దేశ ప్రజలనే తప్పుదోవ పట్టించారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్కశర్మల వైవాహిక జీవితంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారు. సాఫిగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చాయని, #VirushkaDivorce అనే హాష్ ట్యాగ్ సృష్టించి వైరల్ చేశారు. శుక్రవారం ఈ ట్యాగ్ నెట్టింట హల్‌చల్ చేయడంతో సినీ, క్రికెట్ వర్గాల అభిమానులు షాక్‌కు గురయ్యారు. 2016లో ఓ వెబ్‌సైట్‌ రాసిన ఫేక్ న్యూస్‌ని చూసిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా.. ఈ హ్యాష్‌ట్యాగ్‌ని వైరల్ చేశారు.

విరుష్కా ఫ్యాన్స్ ఫైర్

ఇదిలా ఉంటే.. #VirushkaDivorce హ్యాష్ ట్యాగ్‌ను విరాట్, అనుష్క స్వయంగా ప్రమోట్ చేస్తున్నారనే ట్వీట్లు కూడా కనిపించంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను చూసి విదేశీ అభిమానులు కూడా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే విషాదం మరోటి ఉండదు అనే ట్వీట్ చేస్తున్నారు.

ఫేక్ న్యూస్‌ మీమ్స్ వైరల్

అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సిగ్గు, శరం ఉందా? అని ప్రశ్నిస్తూ?' ఘాటుగా ట్వీట్ చేస్తున్నారు. ఈ వార్తను చూసిన తర్వాత విరాట్, అనుష్క ఫీలింగ్స్ ఇలానే ఉంటాయంటూ సృష్టించిన మీమ్స్ చాలా గమ్మత్తుగా, నవ్వు పుట్టించేలా ఉన్నాయి. ఏది ఏమైనా ఇది ఫేక్ న్యూస్ అనే విషయం స్పష్టంగా తెలుస్తుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు విసిరారు.

విడాకులివ్చాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

విడాకులివ్చాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే నంద్‌కిషోర్ గుర్జార్ కూడా దేశ భక్తుడైన విరాట్ కోహ్లీ.. దేశ ద్రోహి అయిన అనుష్క‌కు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుష్క నిర్మాతగా వ్యవహరించిన ‘పాతాల్‌లోక్' అనే వెబ్‌ సిరీస్‌లో మత విద్వేషాలు పుట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. అంతేకాక.. ఆ సిరీస్‌ నిర్మాతగా వ్యవహరించిన అనుష్క దేశ ద్రోహి అని మండిపడ్డారు. దేశం కోసం ఆడుతున్న విరాట్‌ దేశభక్తుడు కాబట్టి వెంటనే అనుష్కకు విడాకులు ఇచ్చి.. తన దేశభక్తిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.

ఐపీఎల్‌‌లో వర్ణ వివక్ష.. డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు!

Story first published: Sunday, June 7, 2020, 14:04 [IST]
Other articles published on Jun 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+