ధోనీ నీకిది తగునా.. రూ 800 కోట్ల ఆస్తి ఉన్న నీవు లక్ష రూపాయల విరాళమా?

హైదరాబాద్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది. తిండిదొరక్క అభాగ్యులు అల్లాడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని జీవులు.. యాచకుల పరిస్థితి మరి అధ్వాన్నంగా తయారైంది. మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర సరకులు దొరక్క.. భవిష్యత్తుపై భరోసా లేక ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో పైసలున్న మహరాజులు.. అపర కుబేరులు తమ సాయాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకుంటున్నారు. తిండిలేక అల్లాడుతున్న ప్రజలకు తోచిన సాయం చేస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ఇలా అన్ని రంగాలవారు ముందుకొస్తున్నారు.

బజరంగ్ పూనియాతో..
బజరంగ్ పూనియా తన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించి క్రీడారంగంలో ఈ కార్యక్రమానికి నాంది పలికాడు. అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ సారవ్ గంగూలీ రూ. 50 లక్షలు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షలు, పీవీ సింధు రూ. 10 లక్షలు, పఠాన్ బ్రదర్స్ మాస్క్‌ల వితరణ, సానియా మీర్జా భోజన సదుపాయం.. మారథాన్ రన్నర్ హిమాదాస్ ఒకనెల జీతం ఇలా తోచిన విధంగా తమ వంతు సాయాన్ని చేస్తున్నారు.
ప్రపంచకప్ ఫైనల్ ఆడటం కంటే ప్రేయసికి ప్రపోజ్ చేయడమే కష్టం : మ్యాక్స్‌వెల్
ఫండ్ రైసింగ్ సంస్థకు ధోనీ విరాళం..
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం రూ. లక్ష రూపాయల సాయం చేశాడు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పూణేలోని పేదలకు ఆదుకునేందుకు కృషి చేస్తున్న ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థకు మహీ ఈ మొత్తాన్ని అందించాడు.
నిజానికి పూణేలోనే పేదలకు ఆదుకోవడం కోసం మాధవ్ ఫౌండేషన్ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధోని లక్ష రూపాయలు విరాళం ఇవ్వగానే మిగతా వారు స్పందించారు. ఇప్పటికే పూణేలోని నిరుపేద ప్రజలను గుర్తించిన ఫౌండేషన్.. నిత్యవసర వస్తువులైన సబ్బులు, బియ్యం, గోధుమపిండి, నూనె తదితర వస్తువులను ఒక ప్యాకెట్లో వారికి అందజేస్తుంది.
రూ. 800 కోట్లున్న నీవు.. లక్ష సాయమా?
అయితే ధోనీ సాయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 800 కోట్ల నికర విలువ(మొత్తం ఆస్తుల నుంచి అప్పులు తీసివేయగా వచ్చే విలువ) కలిగి ఉన్న ధోనీ కేవలం రూ. లక్ష రూపాయలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోట్ల ఆదాయంలో నుంచి ఓ కోటీ సాయం చేస్తే ఏమైనా అవుతుందా? అని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మహీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
‘నికర విలువ సుమారు 800 కోట్లు ఉన్న ధోనీ లక్ష రూపాయలతో పూణేలోని 100 కుటుంబాలకు అండగా నిలిచాడు.'అని ఒకరు కామెంట్ చేస్తే.. చాలా పెద్ద మొత్తం సాయం చేశాడని ఇంకొకరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. మరొకరైతే.. ‘ఎక్కవ డబ్బులుంటే మరింత కంజూస్ గాళ్లు అవుతారని నిరూపితమైంది.. సెల్యూట్ సౌత్ ఇండియన్ హీరోస్' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సిగ్గుగా ఉంది.. అభిమానుల ఆవేదన..
ఇక మరో అభిమాని‘నేను ధోనీ డై హార్డ ఫ్యాన్. కానీ లక్ష రూపాయల సాయం చేశాడంటేనే సిగ్గుగా ఉందని'తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 12 మంది విద్యార్థులు కలిసి 2.5 లక్షలు విరాళం ప్రకటిస్తే.. అత్యంత ధనవంతుడైన ధోనీ కేవలం లక్ష రూపాయలు సాయం చేశాడని మరొక ఫ్యాన్ కామెంట్ చేశాడు.
అయితే మరికొందరూ మాత్రం ధోనీ.. కేవలం ఫండ్ రైజింగ్ సంస్ధకే ఇచ్చాడని, ఇంకా పీఎం రిలీఫ్ ఫండ్ జార్ఖండ్ ప్రభుత్వానికి సాయం చేయలేదంటున్నారు. త్వరలోనే భారీ మొత్తం విరాళాలు ప్రకటించే అవకాశం ఉందని, ధోనీ ఖచ్చితంగా చేస్తాడని చెబుతున్నారు. దయచేసి అతన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక కోహ్లీ, రోహిత్, రాహుల్ ఇంకా చాలా మంది స్టార్ క్రికెటర్లు ఎవరూ విరాళాలు ప్రకటించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications