ప్రపంచకప్ ఫైనల్ ఆడటం కంటే ప్రేయసికి ప్రపోజ్ చేయడమే కష్టం : మ్యాక్స్‌వెల్

సిడ్నీ: ప్రపంచకప్ ఫైనల్లో ఆడటం కంటే ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడమే చాలా కష్టమని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న మ్యాక్సీ.. భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో గత నెలలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే అందరి ప్రేమికుల్లానే తనకు ప్రపోజ్ చేయడంలో కష్టాలు ఎదురయ్యాయని ఈ ఆసీస్ స్టార్ చెప్పుకొచ్చాడు. స్నేహితురాలైన వినీకి తన ప్రేమను ఎలా వ్యక్త పరచాలని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నాడు. ప్రపోజ్ చేయడానికి తాను రచించిన మూడు ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయన్నాడు.

ప్రపోజ్ చేయడం అంత ఈజీ కాదు..
‘ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం అంత సులువు కాదు. ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్‌కు గురయ్యానో అంతకంటే ఎక్కువ టెన్షన్ వినీకి ప్రపోజ్ చేసేటప్పుడు పడ్డాను. ఒకాను ఒక సమయంలో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కంటే ప్రపంచకప్ ఫైనల్ ఆడటమే సులభం అనిపించింది.

మా స్నేహం ఏమవుతుందోనని..
మా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. నేను గతంలో మానసికి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమె అండగా నిలిచింది. నేనేంటో నాకంటే ఆమెకే ఎక్కువ తెలుసు. దీంతో వినీనే నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలి నిశ్చయించుకున్నా. అయితే నా ప్రేమను ఎలా వ్యక్త పరిచాలానే విషయంలో తెగ ఇబ్బంది పడ్డా. మూడు సార్లు విఫలమయ్యాను కూడా. నా ప్రేమను వినీకి చెప్పడానికి మొత్తం నాలుగు ప్రణాళికలు రచించాను.
నా కెరీర్‌లో బాధపడిన సందర్భం అదే: రోహిత్

కుక్కులు అరవడంతో..
ప్లాన్-ఏలో భాగంగా తనను ఓ పార్క్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నా. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్ద వాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు అరవడం వంటివి నన్ను ఇబ్బందికి గురి చేశాయి. దీంతో ప్లాన్- బి రచించా. ఇందులో భాగంగా తనను లంచ్‌కు తీసుకెళ్లి రింగ్‌ను తన చేతికి పెట్టి ప్రపోజ్ చేద్దామనుకున్నా? కానీ అక్కడ అనూహ్యంగా నా టీమ్‌మేట్స్‌ను చూసి ప్రపోజ్ చేయలేకపోయా. దీంతో ప్లాన్ సీకి వెళ్లాళ్సి వచ్చింది. ఇందులో భాగంగా ఎర్రటి గులాబి పూల మధ్య నా ప్రేమను ఆమెకు చెబుదామని రోజ్ పార్క్‌కు తీసుకెళ్లాను. అక్కడా కుదరలేదు.

మోకాళ్లపై కూర్చోని
దీంతో ప్లాన్ డి తప్పక అమలు చేయాల్సిందేనని భావించా. పార్క్‌కు వినీని రమ్మని చెప్పా. ఆమె వచ్చిన వెంటనే ఆమె ముందు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమెకు తొడిగి నా లవ్ ప్రపోజ్ చేశా. ఆ సమయంలో నా గుండె వందరెట్లు వేగంగా కొట్టుకుంది.. నా చేతులు వణికాయి. అయితే నా ప్రేమను వినీ ఒప్పుకోవడంతో నా ఊపిరి నాకు తిరిగొచ్చినట్లైంది. ఆ మధుర క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి'అంటూ మ్యాక్స్‌వెల్ తన ప్రపోజ్ కష్టాలను చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications