Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పొగలు గక్కిన క్రిస్‌ లిన్ గుండు.. ఆడుకుంటున్న నెటిజన్లు (వైరల్ వీడియో)

Twitter reacts to a viral video of Chris Lynn’s head releasing steam

హైదరాబాద్ : పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్)-2020 లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌లిన్‌ గుండు నుంచి పొగలు వచ్చాయి. ప్రస్తుత ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానులు ఫన్నీ కామెంట్స్, మీమ్స్‌తో లిన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇంతకేం జరిగిందంటే..

ఐఎస్‌ఎల్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్‌లిన్.. పెషావర్ జల్మి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు పేలవ బౌలింగ్‌ను చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న అతను బౌలర్లపై అరిచాడు. అయితే ఈ క్రమంలో అతని నెత్తి మీది నుంచి పొగలు వచ్చాయి. ఇదంతా కెమెరాల్లో రికార్డువ్వడంతో టీవీల ముందు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెంటనే తమ మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గుండు వేడెక్కింది..

ఇక ఈ వీడియోకు ఫన్నీ కామెంట్స్ జోడిస్తున్న నెటిజన్లు.. నవ్వు పుట్టించే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘అవును క్రిస్ లిన్ గుండు ఉంది కాబట్టి సరిపోయింది. మరీ వెంట్రుకల ఉంటే కాలిపోయేవా?'అని ఒకరంటే.. అతని కోపం పొగలు గక్కుతుందని ఇంకొకరు కామెంట్ చేశారు. మండుతున్న క్రిస్ లిన్ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కెమెరా జిమ్మిక్కా..?

కెమెరా జిమ్మిక్కా..?

అయితే ఈ పొగలు ఎలా వచ్చాయో? ఎందుకు వచ్చాయో అనేదే అంతు పట్టడం లేదు. అదేమన్నా కెమేరా జిమ్మిక్కా అంటే? అలా అనిపించడం లేదు. మొత్తానికి ఈ వీడియో చూసినవాళ్లంతా అవాక్కవుతున్నారు.

కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

ఖలందర్స్ ఓటమి..

వర్షం అంతరాయం కల్పించిన ఈ మ్యాచ్‌లో క్రిస్ లీన్ టీమ్ లాహోర్ ఖలందర్స్ 16 పరుగులతో ఓటమిపాలైంది. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జల్మి 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టామ్‌ బాంటన్‌ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34), హైదర్‌ అలీ (12 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 34) దూకుడుగా ఆడారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఖలందర్స్‌ 115 పరుగులే చేసి ఓటమిపాలైంది. క్రిస్‌లిన్‌ ( 15 బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్ 30), సమిత్‌ పటేల్‌ ( 15 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 34 నాటౌట్), ఫకర్‌ జమాన్‌ (22) చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.

Story first published: Saturday, February 29, 2020, 17:55 [IST]
Other articles published on Feb 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+