PSL 2020లో ముంబై ఇండియన్స్ గ్లోవ్స్.. క్రికెట్ కిట్లకు కూడా దిక్కులేదా? అంటూ పాక్‌పై నెటిజన్ల ఫైర్

హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)2020లో కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న వెస్టిండీస్ క్రికెటర్ రూథర్ ఫోర్డ్ ముంబై ఇండియన్స్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన రూథర్ ఫోర్డ్.. భారత క్యాచ్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే పీఎస్‌ఎల్ కోసం పాక్‌లో అడుగుపెట్టాడు. అయితే అతను ముంబై కిట్‌తోనే అక్కడికి చేరుకున్నాడు. ఆఖరికి ముంబై ఇండియన్స్ మాస్క్‌తో పాక్‌లో అడుగుపెట్టాడు. మాస్కే కాకుండా మ్యాచ్‌లో కూడా ముంబై గ్లౌవ్స్‌తో బరిలోకి దిగడంతో నెటిజన్లు పీఎస్‌ఎల్ నిర్వాహకులపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం ఆటగాళ్ల కిట్లకు కూడా దిక్కులేదా అని ఎత్తిపొడుస్తున్నారు.
గప్పాలు కొట్టడమేనా..?
ఐపీఎల్ కంటే.. పీఎస్‌ఎల్ పెద్ద టోర్నీగా గప్పాలు కొట్టే పాక్ మాజీ ఆటగాళ్లు.. ఇది చూశారా? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్ కిట్‌తో ఆడుతున్నారంటే.. మీ స్థాయి..ఇదంటూ మండిపడుతున్నారు. కనీసం కిట్స్ అయిన ఆటగాళ్లకు ఇవ్వండని సూచిస్తున్నారు. ఇక పీఎస్‌ఎల్ నిర్వాహకులతో పాటు కరాచీ కింగ్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులతో లీగ్ నిర్వహించలేరా? అని ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ ముగియగానే..
పీఎస్‌ఎల్ 2020 సీజన్ వాస్తవానికి మార్చిలోనే ముగియాల్సింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అప్పట్లో వాయిదాపడిన టోర్నీ చివరి భాగాన్ని ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోంది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్ ముగియగానే.. పీఎస్‌ఎల్‌లో ఆడే విదేశీ క్రికెటర్లు నేరుగా పాక్ గడ్డపై వాలిపోయారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆటగాడు రూథర్‌ఫర్డ్ కూడా అక్కడి వెళ్లగా.. అతనికి కిట్‌ని కరాచీ కింగ్స్ ఫ్రాంఛైజీ మ్యాచ్ సమయానికి సమకూర్చలేకపోయింది. దాంతో.. ముంబై ఇండియన్స్ కిట్‌తోనే అతను బరిలోకి దిగాడు.
ఒక్క మ్యాచ్ ఆడలేదు..
ఐపీఎల్ 2020 సీజన్‌లో రూథర్‌ఫర్డ్ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. టోర్నీలో ఫైనల్‌తో సహా 16 మ్యాచ్‌లాడిన ముంబై టీమ్.. ఐదో సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి వరకు రూథర్‌ఫర్డ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే.. కరాచీ కింగ్స్ తరఫున ఆడిన మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న రూథర్‌ఫర్డ్ ఒక పరుగుకే ఔటైనప్పటికీ.. ఆ జట్టు ముల్తాన్ సుల్తాన్‌ని సూపర్ ఓవర్‌లో ఓడించి ఫైనల్‌కి చేరింది. మంగళవారం కరాచీ వేదికగా కరాచీ కింగ్స్, లాహోర్ ఖలండర్స్ మధ్య ఫైనల్ జరగనుంది.
‘రనౌట్' కోసం ఆన్‌లైన్ ఓటింగ్ పెట్టండి.. బిగ్‌బాష్ కొత్త రూల్స్‌పై నెటిజన్ల సెటైర్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications