IPL 2020: ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి కోహ్లీ.. ఇందుకే కదా నిన్ను చెత్త కెప్టెన్ అనేది!

హైదరాబాద్: 'కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను దేవదత్ పడిక్కల్ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో'... ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ నోట వచ్చిన మాట ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్‌లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాటింగ్‌లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో సన్ రైజర్స్ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్‌ను తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లీ పరిణతిని తెలియజేస్తుందని విమర్శిస్తున్నారు. ఈ మాట చెప్పడానికి సిగ్గుండాలని కూడా కొంత మంది అభిమానులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

బెంగళూరు బెంగ తీరనిది..
గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లీ ఐపీఎల్ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది. అతని టీమిండియా సారథ్యానికే ఎసరు తెచ్చేలా ఉంది. ఇప్పటికే గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు విరాట్ కెప్టెన్సీపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రోహిత్ శర్మ అభిమానులు అయితే విరాట్ కోహ్లీని పక్కనపెట్టేసి సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

బ్యాంటింగ్ వైఫల్యం..
ఈసారి ఐపీఎల్‌లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్ కలిపి వరుసగా ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్‌లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది.
అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లీ ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలవడంతో ఆర్‌సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్‌రేట్ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా, ఎలిమినేటర్‌లోనే జట్టు ఆట ముగిసింది.

కోహ్లీ అట్టర్ ఫ్లాఫ్
అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ టోర్నీలో మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రైక్‌రేట్ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్‌లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్‌లకంటే (55) ఓడిన మ్యాచ్‌ల సంఖ్య (63) ఎక్కువ.
IPL 2020 బెస్ట్ ఎలెవన్ ప్రకటించిన సంజయ్ మంజ్రేకర్ .. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు నో చాన్స్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications