Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020 బెస్ట్ ఎలెవన్‌ ప్రకటించిన సంజయ్ మంజ్రేకర్ .. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు నో చాన్స్!

Sanjay Manjrekar picks his best IPL 2020 XI

న్యూఢిల్లీ: కరోనా అడ్డంకులను అధిగమించి గ్రాండ్ సక్సెస్ అయిన ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఎలిమినేటర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఆడనుంది. అయితే ఇప్పటి వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో నిలకడగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఐపీఎల్ 2020 అత్యత్తమ జట్టును ప్రకటించాడు.

ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు సంజయ్ అవకాశం ఇవ్వలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోహ్లీ స్థానంలో ముంబై ఇండియన్స్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశాడు.

అందుకే సూర్య..

అందుకే సూర్య..

ఇక కోహ్లీని కాదని సూర్య కుమార్ యాదవ్ తీసుకోవడానికి గల కారణాన్ని కూడా సంజయ్ వెల్లడించాడు. ‘నా టీమ్ నంబర్ 3 బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్. అతని నిలకడైన ఆటనే ఈ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్‌లో ఎంపిక చేసేలా చేసింది. ఇక మూడో స్థానంలో అతను రాణించినట్లు మరే ఇతర బ్యాట్స్‌మెన్ రాణించేలేదు. కేవలం పరుగులు చేయడమే కాదు. అతను ఆడే క్వాలిటీ షాట్స్ నన్ను ఆకట్టుకున్నాయి.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-1లో సూపర్ ఫిఫ్టీతో సూర్య.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ఎంపిక చేసిన భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు చెలరేగగా.. తన టీమ్‌లో కోహ్లీకి బదులుగా అతనికి చోటిచ్చిన మంజ్రేకర్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాడు.

ఓపెనర్లుగా కర్ణాటక జోడీ..

ఓపెనర్లుగా కర్ణాటక జోడీ..

ఈ సీజన్‌లో దుమ్ము రేపిన కర్ణాటక ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా తీసుకున్న మంజ్రేకర్.. ఏబీడివిలియర్స్, నికోలస్ పూరన్‌లను మిడిలార్డర్ బ్యాట్స్‌మనెగా ఎంపిక చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. విధ్వంసకర ఆటతో ఆకట్టుకున్న ఏబీడిని నాలుగో స్థానంలో.. కింగ్స్ పంజాబ్ తరఫున స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న నికోలస్ పూరన్‌ను ఐదో స్థానంలో జట్టులోకి తీసుకున్నాడు.

ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్..

ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్..

ఇక ఆల్ రౌండర్‌గా అక్షర్ పటేల్‌ను ఎంచుకున్న మంజ్రేకర్.. ఈ సీజన్‌లో అతనెంతో ఆకట్టుకున్నాడని తెలిపాడు. ఎప్పుడూ తక్కువ అంచనాకు గురయ్యే అక్షర్ ఈ సారి మైమరిపించాడని కొనియాడాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలబడ్డాడని తెలిపాడు. ‘అక్షర్ పటేల్ నా బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఎప్పుడూ అతన్ని తక్కువ అంచనా వేస్తారు. కానీ ఈ సారి అక్షర్ విజృంభించాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫెమెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

రబడాకు నో చాన్స్..

రబడాకు నో చాన్స్..

ఇక లీగ్‌లో 25 వికెట్లతో చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేసర్ కగిసో రబడా‌ను సంజయ్ మంజ్రేకర్ విస్మరించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, మహ్మద్ షమీలను పేస్ త్రయంగా ఎంచుకున్న మంజ్రేకర్.. రషిద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్‌లను స్పిన్నర్లుగా తీసుకున్నాడు.

మంజ్రేకర్ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్:

కేఎల్ రాహుల్(కీపర్), మయాంక్ అగర్వాల్, సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, నికోలస్ పూరన్, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

సీఎం కాబోతున్న ఐపీఎల్ మాజీ ప్లేయర్, విరాట్ కోహ్లీ కెప్టెన్‌!

Story first published: Sunday, November 8, 2020, 11:41 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+