Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టామ్‌ మూడీ వరల్డ్ టీ20 ఎలెవన్.. ధోనీకి నో చాన్స్.. కెప్టెన్‌గా రోహిత్

Tom Moody picks Rohit Sharma as the skipper of his World T20 XI, No MS Dhoni

న్యూఢిల్లీ: కరోనా పుణ్యమా ఫాంటసీ క్రికెట్‌కు పిచ్చ క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు తమ అత్యుత్తమ జట్లను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ వరల్డ్ టీ20 ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. భారత ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే వ్యాఖ్యతగా క్రిక్‌బజ్ నిర్వహించిన షోలో మూడీ ఈ జట్టును ప్రకటించాడు.

పూర్తిగా ఈ తరం ఆటగాళ్లనే తీసుకున్న మూడీ ఆశ్చర్యకరంగా భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, టీ20 ఫార్మాట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్స్ డ్వాన్ బ్రావో, లసిత్ మలింగాలను తీసుకోలేదు.

రోహిత్‌కు జట్టు పగ్గాలు..

రోహిత్‌కు జట్టు పగ్గాలు..

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ‌ను తన అత్యుత్తమ జట్టుకు సారథిగా ప్రకటించిన మూడీ.. ఓపెనర్‌గా అతనికి తోడుగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేశాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున నాలుగు టైటిళ్లు అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ గుర్తింపు పొందగా.. వార్నర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పలు రికార్డులు నెలకొల్పాడు.

ధోనీని కాదని..

ధోనీని కాదని..

ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడో స్థానంలో తీసుకున్న మూడీ.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను నాలుగో స్థానంలో ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీపర్‌గా ధోనీని కాదని విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను ఎంచుకున్నాడు. అయితే మూడు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన మహీని పక్కన పెట్టడం గమనార్హం. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్‌ను తీసుకున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున చెలరేగిన రస్సెల్.. జమైకా తలైవాస్ తరఫున శతకాలే బాదాడు.

పేస్ త్రయం..

పేస్ త్రయం..

స్పిన్నర్లుగా సునీల్ నరైన్, రషీద్ ఖాన్ తీసుకున్న ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్.. పేసర్లుగా మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంపిక చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన టీ20 ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ జోరును అడ్డుకునే సత్తా రషీద్, సునీల్‌కు ఉండగా.. స్టార్క్, ఆర్చర్, బుమ్రా యార్కర్ల స్పెషలిస్ట్‌లు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వారి బౌలింగ్ అద్భుతం. ఇక భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌కు ముగ్ధుడైన మూడీ.. అతన్ని 12వ ఆటగాడిగా ఎంపిక చేశాడు.

టామ్ మూడీ వరల్డ్ టీ20 ఎలెవన్:

టామ్ మూడీ వరల్డ్ టీ20 ఎలెవన్:

డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, నికోలస్ పూరన్(కీపర్), ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా(12వ ఆటగాడు)

నా క్రికెట్ కెరీర్‌లోనే అదో పెద్ద వెన్నుపోటు: సౌరవ్ గంగూలీ

Story first published: Friday, July 10, 2020, 15:26 [IST]
Other articles published on Jul 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+