
చాపెల్-గంగూలీ గొడవ..
ఇక భారత క్రికెట్‌లోనే ఓ విప్లవం తీసుకొచ్చిన దాదా.. 2005లో చాపెల్ కారణంగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటునే కొల్పోయాడు. గంగూలీని తప్పించాలని బీసీసీఐకి చాపెల్ రాసిన మెయిల్ లీకవ్వడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. భారత పార్లమెంట్‌ను కూడా స్థంభింపచేసింది. అనంతరం సత్తా చాటిన దాదా 2006లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ జట్టు పగ్గాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక చాపెల్ ప్రయోగాలు బెడిసి కొట్టడంతో 2007 ప్రపంచకప్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటకుండా ఇంటిదారిపట్టింది.

వెన్నుపోటు..
తాజాగా ఈ వ్యవహారంపై ఓ బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా స్పందించాడు. ‘నా క్రికెట్ కెరీర్‌లోనే ఇదో అతిపెద్ద ఎదురుదెబ్బ. జీవితంలో నాకు జరిగిన అన్యాయం కూడా ఇదే. ఎప్పుడూ న్యాయం దొరకదనే విషయం నాకు తెలుసు. అయినా అలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చు. జింబాబ్వే పర్యటనలో జట్టు కెప్టెన్ ఉన్న నాపై స్వదేశం రాగానే వేటు వేసారు.
2007 ప్రపంచకప్ గెలవాలని కలలు కన్నా. 2003 ప్రపంచకప్ ఫైనల్లో మేం ఓడటంతో ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా సారథ్యంలో ఐదు సంవత్సరాలు జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. అయినా నన్ను ఆకస్మాత్తుగా జట్టు నుంచి తీసేశారు. తొలుత వన్డేలు అన్నారు. ఆ తర్వాత టెస్ట్‌ల్లో కూడా పక్కనపెట్టారు.

చాపెల్ ఒక్కడే కాదు..
ఈ వ్యవహారంలో గ్రేగ్ చాపెల్‌ను ఒక్కడినే నిందించాలనుకోవడం లేదు. ఇదంతా అతనే మొదలుపెట్టాడనడంలోనైతే ఎలాంటి సందేహం లేదు. ఆకస్మాత్తుగా నాకు వ్యతిరేకంగా అతను బోర్డుకు మెయిల్ చేశాడు. అది కాస్త లీకైంది. ఇదంతా సర్వసాధారణమే. క్రికెట్ టీమ్ కూడా ఓ కుటుంబంలాంటిదే. మన కుటుంబాల్లో ఉన్నట్టే భేదాభిప్రాయాలు, అపార్ధాలు ఇక్కడ ఉంటాయి. కానీ ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. కోచ్‌గా అతనికి నా ఆటతీరు నచ్చకుంటే నాతో మాట్లాడాల్సింది. నా పునరాగమనంలో అతను చేసింది అదే. ఇదే ముందు చేస్తే ఇదంతా జరిగేది కాదు.

ఇతరులేం సుద్దపూసలు కాదు..
ఈ వ్యవహారంలో ఇతరులేం సుద్దపూసలు కాదు. వారి ప్రోద్బలం లేనిది ఈ విదేశీ కోచ్ ఒక్కడే కెప్టెన్‌ను తీసేయాలని సెలెక్షన్ కమిటీకి చెప్పలేడు. బోర్డు పెద్దల సాయంతోనే ఇదంతా జరిగిందని నాకు తెలుసు. నన్ను జట్టు నుంచి తీసేయాలనే కుట్రలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉంది. కానీ నేను మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. నా ఆత్వవిశ్వాసం సన్నగిల్లలేదు.' అని దాదా స్పష్టం చేశాడు.
గంగూలీకి నగ్మా బర్త్‌డే విషెస్.. సంగతేంటని ఆటపట్టిస్తున్న నెటిజన్లు!


Click it and Unblock the Notifications












