మళ్లీ తెరపైకి బేబీ సిట్టర్.. ఈ సారి పంత్ ఏం చేస్తాడో?

ముంబై : క్రికెట్‌లో స్లెడ్జింగ్‌కు కేరాఫ్ అడ్రస్ ఆస్ట్రేలియా టీమ్. మాటలదాడితో ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బతీయడం ఆసీస్ ఆటగాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య. ఈ తరహా స్లెడ్జింగ్‌తోనే క్రికెట్‌లో చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మంకీ గేట్ వివాదం మరిచిపోలేనిది.
ఇక బాల్‌టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని మూల్యం చెల్లించుకున్న తర్వాత ఆసీస్ ఆటగాళ్లలో కొంత మార్పు వచ్చింది. అయితే 2018లో జరిగిన ఇండియా-ఆసీస్ టెస్ట్ సిరీస్‌లో ఆటగాళ్ల స్లెడ్జింగ్ ఇరుజట్ల అభిమానులకు కావాల్సిన మజానిచ్చింది. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్-ఆసీస్ కెప్టెన్ టీమ్‌పైన్ మధ్య జరిగిన మాటల యుద్ధం స్లెడ్జింగ్‌కే ఓ కొత్త నిర్వచనం చెప్పింది. పంత్ సమయస్పూర్తికి నిదర్శనంగా నిలిచింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు వికెట్ల వెనుకా నుంచి టిమ్ పైన్ ‘బేబీ సిట్టర్' అంటూ కవ్వింపులకు దిగాడు. రిషబ్ పంత్ దూకుడును అడ్డకునేందుకు మాటల దాడికి దిగాడు. ‘పంత్ ఈరోజు రాత్రి ఇంట్లో ఉండి మా పిల్లల్ని ఆడిస్తావా..? నేను నా భార్యతో కలిసి సినిమాకి వెళ్తాను' అని పైన్ స్లెడ్జింగ్‌చేశాడు. మౌనంగా ఉండిపోయిన పంత్.. ఆ తర్వాత టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన నోటికి పనిచెప్పి బదులు తీర్చుకున్నాడు. స్లెడ్జింగ్ నీకు ఒక్కడికే కాదు మాకు తెలుసన్నట్లు వ్యవహరించాడు. ‘టిమ్ పైన్ టెంపరరీ, యాక్సిడెంట్ కెప్టెన్ అంటూ ఎగతాళి చేశాడు' అయితే.. ఆ మ్యాచ్ తర్వాత ఓ కార్యక్రమంలో భాగంగా టిమ్ పైన్ కుటుంబ సభ్యులను కలిసిన పంత్.. వారి పిల్లల్ని నిజంగానే ఆడించాడు. అప్పట్లో ఈ బేబీ సిట్టర్ ఫొటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేశాయి.

మరోసారి తెరపైకి...
భారత్, ఆస్ట్రేలియా మధ్య నేటి(మంగళవారం) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుండటంలో ఈ బేబీ సిట్టర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పైన్ లేకపోయినప్పటికీ.. ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌ను రిషబ్ పంత్ ఎలా ఎదుర్కోబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆ బేబీ సిట్టర్ స్లెడ్జింగ్ గురించి తాజాగా టిమ్ పైన్ స్పందించాడు. మ్యాచ్‌లో వికెట్ దక్కకపోవడంతో రిషబ్ పంత్ ఏకాగ్రత్తని దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్‌కి దిగానన్నాడు. కానీ పంత్ చాలా తెలివైన బ్యాట్స్‌మెన్ అంటూ కితాబిచ్చాడు.
పాంటింగ్ రికార్డుపై రోహిత్.. సచిన్ రికార్డుపై కోహ్లీ కన్ను!!

పంత్ వచ్చాడు..
ఇండియా-ఆస్ట్రేలియా తొలి వన్డేలో తుది జట్టులో పంత్ చోటు దక్కించుకున్నాడు. ముగ్గురు ఓపెనర్లు శిఖర్, రోహిత్, రాహుల్‌ను ఆడించే ఉద్దేశంతో పంత్ పక్కన పెడ్తారనే ఊహాగానాలు వినిపించినా.. తుది జట్టులో యంగ్ వికెట్ కీపర్‌కు అవకాశం దక్కింది. కేదార్ జాదవ్ బెంచ్‌కే పరిమితమవ్వగా.. రాహుల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications