For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Happy Birthday Rohit Sharma: అంతగా తెలియని హిట్‌మ్యాన్ మూడు రికార్డులు!

Three lesser-known records held by Birthday Boy Rohit Sharma

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నేటి(గురువారం)తో 33వ పడిలో అడుగుపెట్టాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హిట్‌మ్యాన్ ఈ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ ముంబై క్రికెటర్‌కు ఫ్యాన్స్, మాజీ, సహచర క్రికెటర్లు, సినీ, రాజకీయ వర్గాలు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఫ్యాన్స్ అయితే రోహిత్.. డబుల్ సెంచరీల వీడియోలు.. రికార్డులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్‌లతో తమ అభిమాన క్రికెటర్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌ వేదికగా మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించిన హిట్ మ్యాన్.. కెరీర్ ఆరంభంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు.

ధోనీ ప్రయత్నం..

ధోనీ ప్రయత్నం..

కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అనంతరం రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ ధోనీ చేసిన ప్రయత్నం ఫలించడంతో హిట్‌మ్యాన్‌కు తిరుగే లేకుండా పోయింది. అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే పరిమిత ఓవర్ల కెరీర్ సాఫీగానే సాగినా.. టెస్ట్‌ల్లో మాత్రం విఫలమయ్యాడు. సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్‌లోనే సంప్రదాయక ఫార్మాట్‌లో అడుగుపెట్టిన రోహిత్.. ప్రారంభంలో మెరిసినా.. తర్వాత ఆశించిన స్థాయిలోరాణించలేకపోయాడు. ఒకానొక దశలో జట్టులో చోటే కోల్పోయాడు.

టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా..

టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా..

ఇక గతేడాది చివర్లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి హిట్ మ్యాన్ చెలరేగాడు. కానీ న్యూజిలాండ్ గడ్డపై అనూహ్యంగా గాయపడి వెనుదిరగడంతో.. విదేశాల్లో అతని సత్తా ఎంటో నిరూపించుకునే అవకాశం చేజారింది.

అయితే రోహిత్ తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ముఖ్యంగా అతని ట్రిపుల్ డబుల్ సెంచరీలు.. రోహిత్ పేరుచెప్పగానే అందరికి గుర్తుకు వస్తాయి. కానీ హిట్‌మ్యాన్ నెలకొల్పిన ఓ మూడు అరుదైన రికార్డులు మాత్రం అంతగా ప్రాచూర్యం పొందలేదు. అవేంటో తెలుసుకుందాం.

తొలి టీ20 సెంచరీ..

తొలి టీ20 సెంచరీ..

టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున తొలి టీ20 సెంచరీ సాధించింది ఎవరంటే అందరూ సురేశ్ రైనా, మనీష్ పాండే చెబుతారు. కానీ వీరికన్నా ముందే రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. దేశవాళి క్రికెట్‌లో గుజరాత్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్ మ్యాన్ ఈ ఘనతను అందుకున్నాడు. అయితే ఆ సమయంలో భారత్‌లో టీ20 క్రికెట్‌కు అంతగా ఆదరణ లేకపోవడంతో ఈ రికార్డు మరుగునపడింది. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ ఇప్పటి వరకు 6 సెంచరీలు చేయగా.. అందులో నాలుగు అంతర్జాతీయ క్రికెట్‌లో చేసినవే కావడం గమనార్హం.

అరుదైన జాబితాలో..

అరుదైన జాబితాలో..

వెస్టిండీస్‌తో 2013లో సొంతగడ్డపై జరిగిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్‌తో హిట్‌మ్యాన్ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేశాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ (నవంబర్ 6)లో 280వ ఆటగాడిగా బరిలోకి దిగాడు. మిడిలార్డర్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హిట్‌మ్యాన్(177) అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. అనంతరం ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్.. సచిన్ చివరి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్(111 నాటౌట్) మరో సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆ సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 278 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు.

అయితే అరేంగేట్ర మ్యాచ్‌తో వరుసగా రెండు సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌‌గా రోహిత్ రికార్డుకెక్కాడు. ఈ అరుదైన జాబితాలో 3 వరుస సెంచరీలతో అజారుద్దీన్ టాప్‌లో ఉండగా ఆ తర్వాత రోహిత్, సౌరవ్ గంగూలీ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరి తర్వాత జేమ్స్ నీషమ్, బిల్ పొన్స్‌ఫర్డ్, డఫ్ వాల్టర్స్, అల్విన్ కాలిచరణ్, గ్రేగ్ బ్రెవెట్, అబిద్ అలీలు ఉన్నారు.

సిక్స్‌తో డబుల్ సెంచరీ..

సిక్స్‌తో డబుల్ సెంచరీ..

అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించి ఏకైక బ్యాట్స్‌మన్ రోహితే అంటే.. అందులో సిక్స్‌తో ఈ ఫీట్ అందుకున్న మొనగాడు కూడా అతనే.

2013లో డబుల్ సెంచరీ బాది భారత్ తరఫున ఈ ఘనతనందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. సచిన్ తొలి సారి ఈ ఫీట్ అందుకోగా.. తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ రికార్డు నమోదు చేశాడు. అయితే రోహిత్ మాత్రం ఈ ఘనతను సిక్స్‌తో అందుకోవడం విశేషం. క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్, ఫకార్ జమాన్‌లు కూడా డబుల్ సెంచరీలు బాదగా.. రోహిత్ 2014,2017‌లో మరోసారి డబుల్ సెంచరీలు బాదాడు.

మ్యాచ్ ఫిక్సింగ్‌పై 19 ఏళ్ల తర్వాత క్షమాపణలు చెప్పిన క్రికెటర్!!

Story first published: Tuesday, July 7, 2020, 15:26 [IST]
Other articles published on Jul 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+