
చాలా మంది రీ ఎంట్రీ ఇచ్చారు..
సలీమ్ మాలిక్ తర్వాత ఫిక్సింగ్‌కు పాల్పడిన కొంత మంది పాకిస్థాన్ క్రికెటర్లు.. నిషేధానికి గురై మళ్లీ పాక్ తరఫున మ్యాచ్‌లు ఆడారు. ఇందులో మహ్మద్ అమీర్, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, షర్జీల్ ఖాన్ తదితరులు ఉన్నారు. కొంత మంది క్రికెటర్లపై జీవితకాలం నిషేధం విధించిన పీసీబీ.. మధ్యలో వారికి శిక్షని కూడా తగ్గించిందని, కానీ.. తనపై మాత్రం గత 19 ఏళ్లుగా వివక్ష చూపుతోందని సలీమ్ మాలిక్ ఆరోపించాడు. ఓ వీడియో మెసేజ్ ద్వారా తన బాధను వెల్లడించాడు.

నా తప్పును క్షమించండి..
‘19 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి. ఆ ఫిక్సింగ్ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నా. నాకు క్రికెట్ తప్ప మరొకటి తెలియదు. 8 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతూ పెరిగాను. నా జీవనాధరం కూడా ఇదే. ఫిక్సింగ్ విషయంలో నన్ను, ఇతర ఆటగాళ్లను పీసీబీ చూస్తున్న విధానంపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తాను. పీసీబీ, ఐసీసీ నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు, వారికి సహకరించేందుకు నేను సిద్దం. 'అని సలీమ్ మాలిక్ తెలిపాడు.

కోచ్‌గా కూడా పనికి రానా..
ఇక సలీమ్ మాలిక్.. 2008లో పాక్ హెడ్ కోచ్, 2012లో బ్యాటింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోగా.. పీసీబీ తిరస్కరించింది. దీనిపై మాలిక్ మాట్లాడుతూ పీసీబీపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ఫిక్సింగ్‌కు పాల్పడిన మహ్మద్ అమీర్, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, షర్జీల్ ఖాన్ మళ్లీ వచ్చి క్రికెట్ ఆడవచ్చు. కానీ నేను మాత్రం కనీసం కోచ్‌గా కూడా పనిచేయవద్దు'అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక మాలిక్ యాంటీ కరప్షన్ చట్టాల ప్రకారం విచారణకు సహకరిస్తే.. అతను మళ్లీ క్రీడల్లోకి అడుగుపెట్టవచ్చని పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫజుల్ రిజ్వీ తెలిపారు. 2011లో తాము అడిగిన ప్రశ్నలకు ముందు అతను సమాధానాలు చెప్పాలని, లండన్‌లో పాల్గొన్న సమావేశాల వివరాలు తెలియజేయాలన్నాడు.


Click it and Unblock the Notifications












