న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఆడిన టీమిండియా కాదు.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్‌పై పాక్ క్రికెటర్ ప్రశంసలు..

Virat Kohli Is An Exceptional Leader, Says Shoaib Akhtar || Oneindia Telugu
This is a new Indian team, not like my playing days: Shoaib Akhtar

ఇస్లామాబాద్ : బెంగళూరు వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన కోహ్లీసేన వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తాడు.

ఈ సిరీస్ రెండు జట్ల మధ్య జరిగిన సాదాసీదా పోరు కాదని, భారత్-ఆసీస్ ఆత్మగౌరవ యుద్దమని అభివర్ణించాడు. కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత జట్టు... తాను ఆడిన రోజుల్లోని టీమిండియాలా కాదన్నాడు.

కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్..

కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్..

‘విరాట్ కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్. ధృడసంకల్పం కలిగిన వ్యక్తి. ఓటమి నుంచి ఎలా పుంజుకోవాలో కోహ్లికి అతని ప్లేయర్లకు బాగా తెలుసు. ఎలాంటి అవకాశాన్ని వదులుకోడు. అది బెంగళూరు వేదికగా ప్రత్యర్థి 300 లోపు లక్ష్యాన్ని నిర్ధేశిస్తే.. రోహిత్, ధావన్, అయ్యర్, రాహుల్ వంటి మేటీ ఆటగాళ్లున్న జట్టు ఛేదనను అడ్డుకోవాలనుకోవడం వృథా ప్రయాసే.'అని షోయబ్ తెలిపాడు.

ఆఖరి వన్డేలో ఆసీస్ చిత్తు.. భారత్‌దే సిరీస్

ఇది పరువు పోరు..

ఇది పరువు పోరు..

‘ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య జరిగిన ఆత్మగౌరవ పోరు. ప్రస్తుత టీమ్ నేనాడినప్పటి ఇండియా కాదు. పూర్తిగా విభిన్నం. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత సిరీస్ గెలవడం చాలా కష్టం. కానీ కోహ్లీసే అదరగొట్టింది'అని స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు.

రోహిత్‌ను ఆపడం కష్టం..

రోహిత్‌ను ఆపడం కష్టం..

‘ఒకసారి రోహిత్‌ టచ్‌లోకి వచ్చాడంటే అది మంచి బంతా.. చెడ్డ బంతా అనే ఆలోచనే ఉండదు. ఎలాంటి బంతినైనా బౌండరీకి తరలిస్తాడు. అంత సహసిద్దంగా చెలరేగుతాడు. చిన్నస్వామి స్టేడియం అంటే మరింత రెచ్చిపోతాడు. మొత్తానికి ఇరుజట్లు మంచి క్రికెట్ ఆడాయి. అభిమానులకు కావాల్సిన మజానిచ్చాయి.'అని ఈ పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు.

ఇక రోహిత్ శర్మ(128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119) అద్భుత శతకంతో అదరగొట్టగా.. కెప్టెన్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లతో 89) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో డిసైడర్ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకొని గతేడాది కోల్పోయిన సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకుంది

Story first published: Monday, January 20, 2020, 14:55 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X