ఆఖరి వన్డేలో ఆసీస్ చిత్తు.. భారత్‌దే సిరీస్

అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ(128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119) అద్భుత శతకంతో అదరగొట్టగా.. కెప్టెన్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లతో 89) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో డిసైడర్ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకొని గతేడాది కోల్పోయిన సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. లబుషేన్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. జడేజా రెండు, సైనీ, కుల్దీప్ తలో వికెట్ తీశారు. అనంతరం భారత్.. 47.3 ఓవర్లలో మూడు వికెట్లకు 289 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్, జంపా, అగర్‌లకు తలో వికెట్ దక్కింది.

ఓపెనర్ల శుభారంభం..
భారీ టార్గెట్ ముందున్నా.. గాయంతో శిఖర్ ధావన్ తప్పుకున్నా.. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(19).. మరో ఓపెనర్ రోహిత్ శర్మ
ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకున్నారు. నాలుగో ఓవర్‌లోనే ఫోర్, సిక్సర్‌తో రోహిత్ బాదుడు మొదలు పెట్టాడు. కమిన్స్ వేసిన 9 ఓవర్‌లోనైతే మూడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా రాహుల్ కూడా బౌండరీలు సాధించడంతో పవర్ ప్లే ముసిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. అనంతరం అగర్ వేసిన 13 ఓవర్‌లో బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన రాహుల్ వికెట్ల ముందు చిక్కాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చినా.. ఆస్ట్రేలియా రివ్యూకు వెళ్లి వికెట్ సాధించింది. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 69 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది.

రోహిత్- కోహ్లీ ధనాధన్..
రాహుల్ వికెట్ కోల్పోయినా రోహిత్ తన జోరును ఆపలేదు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌తో ప్రతీ బంతికి పరుగు రాబడుతూనే వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక లబుషేన్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా రాహుల్ కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్. ఓపికగా ఆడిన ఈ జోడీ మంచి బంతులను గౌరవిస్తూ... చెడ్డ బంతులను బౌండరీలకు తరలించింది. ముఖ్యంగా వికెట్ల మధ్య వీరి పరుగు అద్భుతం. ఓవైపు కోహ్లీ నిదానంగా ఆడుతున్న రోహిత్ మాత్రం జంపా వేసిన 26 ఓవర్‌లో ఓ సిక్స్.. ఫించ్ వేసిన 28 ఓవర్‌లో మరో సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు.

రోహిత్ సెంచరీ..
క్రీజులో పాతుకుపోయిన రోహిత్-కోహ్లీ జోడీని విడదీయడానికి ఫించ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. బౌలింగ్ మార్చినా.. ఫీల్డింగ్ జరిపినా ప్రయోజనం దక్కలేదు. హజల్ వుడ్ వేసిన 30 ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు, మరుసటి బంతికి సింగిల్ తీసిన రోహిత్ 110 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో కెరీర్‌లో 29వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆసీస్‌పై అతనికిది 8వ సెంచరీ కావడం విశేషం. తర్వాత హజల్ వుడ్ బౌలింగ్‌లో రోహిత్ ఓభారీ సిక్సర్ కొట్టగా.. కోహ్లీ ఫోర్ కొట్టాడు.

కోహ్లీ హాఫ్ సెంచరీ.. రోహిత్ ఔట్
కమిన్స్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు సాధించిన కోహ్లీ..61 బంతుల్లో 4 ఫోర్లతో 57వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే జంపా వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. గాల్లోకి లేచిన బంతని స్టార్క్ పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 206 పరుగుల పార్డ్‌నర్‌షిప్‌కు తెరపడింది.

చివర్లో అయ్యర్ మెరుపులు
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ ఔటైనా మిగతా పనిని పూర్తిచేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన అయ్యర్.. భారీ షాట్లతో ధాటిగా ఆడాడు. హజల్ వుడ్ వేసిన 42 ఓవర్‌లో రెండు ఫోర్లతో.. స్టార్క్ వేసిన 45 ఓవర్‌లో 6,4తో చెలరేగాడు. ఆ మరుసటి ఓవర్‌లో హజల్ వుడ్ బౌలింగ‌్‌లో కోహ్లీ ఔట్ అయినా.. మనీష్ పాండే(8 నాటౌట్)తో కలిసి విజయాన్నందించాడు.

స్మిత్ ఒక్కడే
ఆసీస్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు వార్నర్(3), ఆరోన్ ఫించ్(19) విఫలమైనా.. స్టీవ్ స్మిత్ (132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌తో 131)సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(54) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలెక్స్ క్యారీ(35) పర్వాలేదనిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications