ఆ విషయంలో ఆసియా రారాజు విరాట్ కోహ్లీనే.!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. అయితే సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏడున్నర కోట్లను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి ఆసియా సెలబ్రెటీగా విరాట్ గుర్తింపు పొందాడు. అంతేకాక, ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, నేమర్ జూనియర్ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అథ్లెట్‌గాను ఘనత సాధించాడు.

కోహ్లీ తర్వాతే ప్రియాంక, దీపికా..
ఆసియా విషయానికొస్తే ఇన్‌స్టా ఫాలోవర్ల విషయంలో మరే సెలబ్రెటీ భారత కెప్టెన్ దరిదాపుల్లో లేరు. ప్రియాంక చోప్రా(56 మిలియన్లు), దీపికా పదుకోన్(52 మిలియన్లు) వరుసగా కోహ్లీ తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు. ఇక కోహ్లీని ఫేస్‌బుక్‌లో 36.9 మిలియన్ మంది అనుసరిస్తుండగా.. ట్విటర్‌లో అతని ఫాలోయర్ల సంఖ్య 37.3 మిలియన్‌గా ఉండటం విశేషం. మొత్తంగా.. 150 మిలియన్ల మంది విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

కోహ్లీ నెట్ వర్త్ రూ.1700 కోట్లు!
ఇక సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న కోహ్లీకి సంపాదన కూడా అదే రీతిలో ఉండి. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, గతేడా విరాట్ కోహ్లీ నెట్‌వర్త్ సుమారు ₹ 196 కోట్లు (US $ 26 మిలియన్లు). అయితే ఇతర నివేదికలు మాత్రం విరాట్ నికర విలువ సుమారు రూ.900 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. ఇంకొన్ని సంస్థలు రూ.1700 కోట్లు అని అంచనా వేసాయి. విరాట్ కోహ్లీ సంపాదనలో ప్రధాన భాగం తన సొంత వ్యాపార పెట్టుబడులు, ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పందాల నుంచే వస్తోంది. క్రికెట్‌పరంగా.. బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్లు ఆర్జిస్తున్న విరాట్.. ఐపీఎల్‌లో ఆర్సీబీ నుంచి 17 కోట్లు తీసుకుంటున్నాడు.

ఆర్‌సీబీ ట్రైనింగ్ షురూ..
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు ట్రెయినింగ్ క్యాంప్ గురువారం నుంచి మొదలు కానుంది. ఆర్‌సీబీ టీమ్ ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్ బుధవారంతో ముగియనుంది. దీంతో జట్టు మొత్తంమూడు వారాల ట్రెయినింగ్ క్యాంప్‌లో పాల్గొననుంది. ఇక్కడి ఐసీసీ క్రికెట్ అకాడమీలో జరిగే ఈ క్యాంప్ పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలో జరగనుంది. ఈ క్యాంప్ కోసం ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్స్ మైక్ హెస్సన్, హెడ్‌కోచ్ సైమన్ కటిచ్ ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేశారు.

చెమటోడ్చిన విరాట్
విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఓ రేంజ్‌లో రెడీ అవుతున్నాడు. టీమ్‌తో కాకుండా స్పెషల్ ఫ్లైట్‌లో దుబాయ్ వెళ్లిన విరాట్.. అక్కడి ఓ హోటల్‌లో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్య మిచ్చే కోహ్లీ.. తన రూమ్ బాల్కనీలో వర్కౌట్స్ చేస్తున్నాడు. పుషప్స్‌తో పాటు వెయిట్స్‌తో పలు ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసి చెమటలు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ టీమ్ బుధవారం సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
CPL 2020: సిక్సర్లతో వీరవిహారం.. బ్రాత్‌వైట్‌ను బాదేసిన కైల్ మేయర్స్.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications