T20 World Cup: టీమిండియా మెంటార్‌గా ధోనీ అవసరమా? జడేజా సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టు కోసం ఎదురుచూసిన అభిమానులకు, విశ్లేకులకు బీసీసీఐ ఊహకందని ఆనందాన్ని కలిగించింది. వరల్డ్‌కప్ విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని జట్టులోకి తీసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్‌గా పనిచేయనున్నాడు.
ఐసీసీ ఈవెంట్స్‌లో కెప్టెన్‌గా ధోనీకి మంచి రికార్డు ఉండటంతోనే జట్టు మార్గదర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరూ తప్పబడుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా టీమిండియా మెంటార్‌గా మహేంద్ర సింగ్ ధోనీని నియమించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.

ఆశ్యర్యం కలిగించింది..
కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుంటే మెంటార్ అవసరమే లేదని సోనీ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ జడేజా అభిప్రాయపడ్డాడు. 'మెంటార్‌గా ధోనీని నియమించడం వెనుక ఉద్దేశం ఏంటో నాకు అస్సలు అర్థం కావడంలేదు. నేను ధోనీ గురించి.. ఆటపై అతడికి ఉన్న అవగాహన, జట్టుకు అతను ఎలా ఉపయోగపడతాడు.. లాంటి విషయాల గురించి మాట్లాడటం లేదు. కెప్టెన్‌గా వైదొలగడానికి ముందే విరాట్ కోహ్లీకి అతను మెంటార్‌గా ఉన్నాడు.
ధోనీకి నాకన్న పెద్ద ఫ్యాన్ లేడు. వీడ్కోలుకు ముందే కెప్టెన్‌ను తయారు చేసిన తొలి సారథి మహీ. కానీ, అతన్ని మెంటార్‌గా తీసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం రవీంద్ర జడేజాకు బదులు అజింక్యా రహానేను ఆడించినట్లుంది'అని అజేయ్ జడేజా చెప్పుకొచ్చాడు.

మెంటార్ అవసరం లేదు..
విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా బాగా ఆడుతోందని, జట్టుకు మెంటార్ అవసరం లేదనేది తన అభిప్రాయమని జడేజా తెలిపాడు. 'మీరు తయారు చేసి వదిలి వెళ్లిన ఆటగాడు జట్టును మరోస్థాయికి తీసుకెళ్తే, కోచ్ జట్టును వరల్డ్ నెం.1 స్థానానికి తీసుకెళ్లాడు. కానీ రాత్రికి రాత్రే మెంటార్ అవసరం ఎందుకు కావాల్సి వచ్చింది.? ఆ ఆలోచనను నన్ను కొంచె ఆశ్చర్యానికి గురిచేస్తోంది.'అని జడేజా పేర్కొన్నాడు.

కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకు!
బహుషా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని జడేజా అభిప్రాయపడ్డాడు. 'భారత క్రికెట్ భిన్నంగా పనిచేస్తుంది. ధోనీ స్పిన్నర్లను ఎక్కువగా ఆడిస్తే.. ఇంగ్లండ్‌లో కోహ్లీ నలుగురు పేసర్లను తీసుకున్నాడు. ఒకరు ఒకలా ఆలోచిస్తే, ఇంకొకరు మరోలా ఆలోచిస్తారు. ఈ రెండు ఆలోచనల కలయిక కోసమే బహుషా ఈ నిర్ణయం తీసుకున్నారేమో.
తన తొలి ఐసీసీ ట్రోఫీ కోసం ప్రయత్నిస్తున్న కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ ధోనిని నియమించి ఉండొచ్చు. కోహ్లీ తన అత్యుత్తమ ఫామ్‌లో లేనందు వల్ల ఈ నిర్ణయంతో అతని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.'అని జడేజా తెలిపాడు.
IPL 2021: చివరి నిమిషంలో తప్పుకోవడంపై ఫ్రాంచైజీల ఆగ్రహం.. పూర్తిగా నిషేధించాలంటూ డిమాండ్!

స్వాగతించిన కపిల్, గవాస్కర్..
ఇక ధోనీని మెంటార్‌గా నియమించడాన్ని భారత దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ స్వాగతించారు. 'ఇది ఓ మంచి నిర్ణయం. ఓ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాక... మూడు లేదా నాలుగేళ్ల తర్వాత మళ్లీ రావాలి. కానీ, ధోనీ విషయంలో ఇది భిన్నంగా జరిగింది. ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అతడిని భారత జట్టుకు మెంటార్‌గా నియమించారు. మరోవైపు రవిశాస్త్రి కూడా ప్రస్తుతం కొవిడ్ బారిన పడ్డాడు. అందుకే ఇది ఓ ప్రత్యేకమైన నిర్ణయం అని చెప్పొచ్చు.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీకి సాటిలేరని, అతని విలువైన సలహాలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని గవాస్కర్ తెలిపాడు. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రితో విభేదాలు తలెత్తితే మాత్రం జట్టుకు తీరని నష్టం జరుగుతుందని, ఈ ఒక్క విషయం మినహా మెంటార్‌గా ధోనీ జట్టుకు లాభపడుతాడన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications