For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: చివరి నిమిషంలో తప్పుకోవడంపై ఫ్రాంచైజీల ఆగ్రహం.. పూర్తిగా నిషేధించాలంటూ డిమాండ్!

IPL 2021: Franchises upset with last minute pull-out by England cricketers, writes letter to BCCI

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో(సన్‌రైజర్స్ హైదరాబాద్), క్రిస్ వోక్స్(ఢిల్లీ క్యాపిటల్స్), డేవిడ్ మలాన్(పంజాబ్ కింగ్స్)లపై ఆయా ఫ్రాంచైజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో ఐపీఎల్ ఆడనివ్వకుండా ఈ ముగ్గురిపై నిషేధం విధించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని కోరాయి. ఈ మేరకు ఓ ఫ్రాంచైజీ అధికారి భారత క్రికెట్ బోర్డుకు లేఖ కూడా రాసారని ఇన్‌సైడ్ స్పోర్ట్ ఓ కథనంలో పేర్కొంది. ముందుగా లీగ్‌కు అందుబాటులో ఉంటామని చెప్పి చివరి నిమిషంలో ఇలా తప్పుకోవడం ఏమాత్రం భావ్యం కాదని సదరు అధికారి పేర్కొన్నాడు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

కఠిన చర్యలు తీసుకోవాలి..

'ఇంగ్లండ్‌కు చెందిన మా కాంట్రాక్ట్ ప్లేయర్‌తో గత గురువారం సాయంత్రం మాట్లాడాను. అతను 15వ తేదీన యూఏఈకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, ఏర్పాట్లు చేయాలని కోరాడు. మేం కూడా దానికి సరే అన్నాం. కానీ ఏమైందో ఏమో కానీ శనివారం లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు మాకు సమాచారమిచ్చాడు. అతని ఆకస్మాత్తు నిర్ణయంతో కోచ్‌లు, మేనేజ్‌మెంట్ చాలా అప్‌సెట్ అయ్యారు. ఇది పూర్తిగా అన్‌ప్రొఫెషనల్. అలాగే కాంట్రాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ విషయమై మేం బీసీసీఐకి లేఖ కూడా రాసాం. చివరి నిమిషంలో హ్యాండిచ్చిన ముగ్గురి ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం.

వారి సమస్యలు..

వారి సమస్యలు..

కరోనా పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వరుసగా బబుల్స్‌లో ఉండటం వల్ల మానసికంగా ఎదురయ్యే సమస్యలను మేం అర్థం చేసుకోగలం. కానీ వారు కూడా మా కష్టాలను అర్థం చేసుకోవాలి. మేం కూడా వారిలానే ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామనే విషయాన్ని గుర్తించాలి. ఇలా చివరి నిమిషంలో ఆటగాళ్లు దూరమైతే మేనేజ్ చేయడం చాలా కష్టం'అని సదరు ఫ్రాంచైజీ అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఫ్రాంచైజీలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాయి.

SRHలోకి పవర్ హిట్టర్..

SRHలోకి పవర్ హిట్టర్..

జానీ బెయిర్ స్టో స్థానంలో వెస్టిండీస్ ప్లేయర్ షెర్ఫేన్ రుథర్‌ఫోర్డ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. మంచి హిట్టర్ అయిన రూథర్‌ఫోర్డ్‌ పలు ప్రాంచైజ్ లీగుల్లో ఆడుతున్నాడు. బెయిర్‌స్టో తప్పుకోవడంతో సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు లైన్ క్లియర్ అయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వార్నర్ కచ్చితంగా ఓపెనర్‌గా ఆడుతాడని అంటున్నారు. ఇక రూథర్‌ఫోర్డ్ 2018లో వెస్టిండీస్ జట్టు తరఫున అరంగేట్రం చేసి 6 టీ20లు ఆడాడు. 43 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలో దిగిన కరేబియన్ క్రికెటర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఈసారి అతడు వేలంలోకి రాగా.. ఎవరూ ఆసక్తి చూపలేదు. జానీ బెయిర్‌స్టో లీగ్ నుంచి తప్పుకోవడంతో ఇలా అదృష్టం కలిసొచ్చింది.

మలన్‌ స్థానంలో మార్క్రమ్..

మలన్‌ స్థానంలో మార్క్రమ్..

ఇక డేవిడ్‌ మలన్‌ స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్‌ అడెన్‌ మార్క్రమ్‌ పంజాబ్‌ కింగ్స్‌ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ తమ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. 'ఐపీఎల్‌ 2021 మిగతా సీజన్‌లో డేవిడ్‌ మలన్‌ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్, యాషెస్‌ సిరీస్‌ వెంట వెంటనే ఉండటంతో అతడు తన కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. అతడి స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్‌ అడెన్‌ మార్క్రమ్‌ ఆడనున్నాడు' అని పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం ట్వీట్‌ చేసింది. క్రిస్‌ వోక్స్‌ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది.

రాజస్థాన్ బలి..

రాజస్థాన్ బలి..

ఇదివరకే పలువురు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ రాయల్స్‌కు చెందిన జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్(కేకేఆర్), ఆడమ్ జంపా(ఆర్సీబీ), కైల్ రిచర్డ్స్‌న్, జై రిచర్డ్‌సన్ కరోనా భయంతో ముందే తప్పుకున్నారు.

అయితే ఆటగాళ్లు తప్పుకునే విషయంలో రాజస్థాన్ రాయల్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లంతా అందుబాటులో లేకుండా పోయారు. ఆఖరి టెస్ట్ రద్దు చేసారనే కోపంలోనే బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఆఖరి నిమిషంలో లీగ్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుుతంది.

కానీ ఐపీఎల్ ఆడితే కఠిన బబుల్‌లో ఉండాలనే నిబంధన, టీ20 ప్రపంచకప్ 2021కు సన్నద్ధం అవ్వాలనే ఆలోచనే ఇంగ్లండ్ ప్లేయర్స్ లీగ్ నుంచి తప్పుకునేలా చేసిందని ఇంగ్లీష్ మీడియా పేర్కొంది.

ఛలో దుబాయ్..

ఛలో దుబాయ్..

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ రద్దవ్వడంతో.. భారత క్రికెటర్లు ముందుగానే ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్నారు. ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, బుమ్రా, సూర్య కుమార్‌ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కూడా కోహ్లి, సిరాజ్‌ కోసం ఇదే తరహా ఏర్పాటు చేసింది. టెస్టు సిరీస్‌లో భాగంగా ఉండి ఐపీఎల్‌ కోసం యూఏఈ వెళ్లాల్సిన మిగిలిన భారత క్రికెటర్లతో (16 మంది)పాటు ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్యామ్‌ కరన్‌ మాంచెస్టర్‌ నుంచి కమర్షియల్‌ ఫ్లయిట్‌ ద్వారా యూఏఈకి వెళ్లారు. వీరి కోవిడ్‌ పరీక్షలన్నీ 'నెగెటివ్‌'గా తేలాయి. యూఏఈ దేశపు నిబంధనల ప్రకారం క్రికెటర్లంతా ఆరు రోజుల పాటు తమ హోటల్‌ గదుల్లో క్వారంటైన్‌లో గడపాల్సి ఉం టుంది. ఆ తర్వాత తమ జట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో వీరు చేరతారు.

Story first published: Sunday, September 12, 2021, 9:56 [IST]
Other articles published on Sep 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+