
సెలెక్టర్ల వైపు భారీ సిక్సర్లు..
ఇలాంటి గొప్ప ఆటగాడి టాలెంట్‌ను గుర్తించి తొలి అవకాశం ఇచ్చింది ఎవరు? అతడి ప్రతిభను గుర్తించింది ఎవరు? అనే విషయాలు ఎప్పటికీ ఆసక్తికరమే. అయితే ఈ విషయం అధికారికంగా ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు ఎవరూ కూడా ప్రస్తావించలేదు. ఎంఎస్ ధోనీ బయోపిక్ అన్‌టోల్డ్ స్టోరీలో కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. 2004 దియోధర్ ట్రోఫీలోని ఓ మ్యాచ్.. ధోనీ జీవితం మారడానికి కీలకమైందిగా చూపించారు. ఆ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ధోనీ వాళ్ల వైపు భారీ సిక్సులు కొట్టినట్లు సినిమాలో చూపించారు. అది నిజమే అయినా, అక్కడ ఓ కీలక విషయాన్ని మాత్రం వదిలేశారు. ధోనీని ఆ దియోధర్ ట్రోఫీకి ఎవరు ఎంపిక చేశారనే విషయాన్ని పట్టించుకోలేదు.

ప్రణబ్ రాయ్‌ను అడగండి..
అయితే, ఆ దియోధర్ ట్రోఫీ మ్యాచ్‌కు ధోనీని ఎంపిక చేసింది తానేనని భారతజట్టు మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్ సయద్ కిర్మాణి తెలిపాడు. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్మాణి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఎవరితోనూ చెప్పలేదని, కావాలంటే తన సహచర సెలక్టర్ ప్రణబ్ రాయ్‌ను కూడా అడగొచ్చని తెలిపారు.
‘ధోనీ ఎంపిక విషయమై నేనిప్పటి వరకు ఎక్కడా ఎవరితో చెప్పలేదు. నేనూ, ఈస్ట్ జోన్ సెలెక్టర్ ప్రణబ్ ఒకసారి రంజీ మ్యాచ్ చూస్తున్నాం. అదే మ్యాచ్ అనేది సరిగ్గా గుర్తులేదు. అయితే, ప్రణబ్ అప్పుడు నాతో ఒక మాట చెప్పాడు. 'ఈ మ్యాచ్‌లో ఒక ఆటగాడున్నాడు. కీపింగ్, బ్యాటింగ్ బాగా చేయగలడు. కచ్చితంగా ఈస్ట్‌జోన్‌కు ఎంపికయ్యే అర్హతలున్నాయి' అని నాతో అన్నాడు.

కీపింగ్ చేస్తున్నాడా..?
దాంతో నేను 'ఇప్పుడు కీపింగ్ చేస్తున్నాడా' అని అడిగాను. అతను కాదని, ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడని చెప్పాడు. అప్పుడే ధోనీ గణంకాలు తెప్పించుకొని పరిశీలించాను. బ్యాటింగ్‌లో అతని నిలకడ చూసి ఆశ్చర్యపోయా. తర్వాత ధోనీ కీపింగ్ కూడా చూడకుండానే అతను ఈస్ట్‌జోన్‌కు ఆడనున్నాడని చెప్పాను. ఆ తర్వాత మొత్తం చరిత్ర మీకు తెలిసిందే 'అని కిర్మాణి వివరించాడు.
ఇక అప్పటి వరకు కీపర్లు కేవలం వికెట్ల వెనుకాలే బాధ్యతలు నిర్వర్తిస్తే చాలానుకుంటున్న రోజుల్లో..గిల్ క్రిస్ట్, మార్క్ బౌచర్ ప్రపంచ క్రికెట్ కీపర్లుగా తమదైన ముద్ర వేశారు. కీపర్లు బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటాలని చెప్పారు. దీంతో దినేశ్ కార్తీక్, పార్దీవ్ పటేల్ రూపంలో నాణ్యమైన కీపర్లు అందుబాటులో ఉన్నా.. వారి బ్యాటింగ్ ఆకట్టుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా ధోనీని ఎంచుకున్నారు. దీంతో భారత్ క్రికెట్ గతి మారింది.

కీపరే బెస్ట్ కెప్టెన్...
ఇక వికెట్ కీపర్లకు సారథ్య బాధ్యతలు ఇవ్వడం వారిపై అదనపు భారం మోపినట్లు అవుతుందని, వారి ఆట దెబ్బతింటుందనుకునే వారని, కానీ ధోనీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడని కిర్మాణి చెప్పుకొచ్చాడు. ‘కెప్టెన్‌కు వికెట్ కీపర్ ఎప్పుడూ గొప్ప సలహాదారుడు. ఫీల్డింగ్ సెట్ చేయడంతో పాటు బ్యాట్స్‌మన్ బలహీనతల గురించి వారికే బాగా తెలుస్తుంది. ధోనీని కెప్టెన్ చేయడంతోనే భారత క్రికెట్‌కు మేలు జరిగింది. వికెట్ కీపర్ ఎంత కీలకమో అతను నిరూపించాడు. మా రోజుల్లో కీపర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే వారి ఆట దెబ్బతింటుందోమోనని భావించేవారు. కానీ ధోనీ వారి అభిప్రాయాలన్ని తప్పని చాటి చెప్పాడు.'అని కిర్మాణి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

సామీని ‘నల్లోడు' అంటూ అప్పట్లో ఇషాంత్ ఇన్‌స్టా పోస్ట్!










