ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది.. వయసు మీదపడినట్లు అనిపించ లేదు: రైనా

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని, అతని శరీరంలో ఎలాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించలేదన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ కోసం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ బ్యాటింగ్ పదును తాను చూశానని రైనా చెప్పుకొచ్చాడు. అతను కొట్టి భారీ సిక్సర్లే ధోనీ ఎంత ఫిట్‌గా ఉన్నాడో తెలియజేశాయన్నాడు.
ఇక వన్డే వరల్డ్ కప్ అనంతరం దాదాపు 9 నెలలు ఆటకు దూరమైన జార్ఖండ్ డైనమైట్.. మళ్లీ చెన్నై నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్ పట్టాడు. ఐపీఎల్‌లో రాణించడం కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా కారణంగా ఏప్రిల్15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసింది.

చెన్నై ఇన్ స్టా లైవ్ సెషన్..
ఇక దేశంలో లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించడంతో ప్రస్తుతం ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. మరోవైపు టోర్నీలన్నీ రద్దవ్వడంతో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న సురేశ్ రైనా.. ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై స్పందించాడు.
ఆ మహిళా క్రికెటర్‌తో డిన్నర్ చేయాలనుంది: భారత క్రికెటర్

ధోనీ కొత్తగా కనిపించాడు..
‘ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది. అతను చాలా వినూత్నంగా కనిపించాడు. మేం ఆడిన ప్రాక్టీస్ గేమ్‌లో ధోనీ భారీ సిక్సర్లు కొట్టాడు. ఉక్కపోతగా ఉండే చెన్నై వాతావారణంలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ ట్రైనింగ్ క్యాంప్‌లో మేం ఆడాం. మహీ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని శరీరంలో ఎలాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించ లేదు. అతను చాలా విభిన్నంగా..దేని కోసమో కసిగా ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. గతంలో ఎన్నడు లేని విధంగా కొత్తగా కనిపించాడు. అతని ఆట చూసినప్పుడు ఈ విషయం మీకే అర్థం అవుతుంది.'అని రైనా చెప్పుకొచ్చాడు.

పంత్‌కు సీనియర్ల అండ అవసరం..
ఇక నిలకడలేమి ప్రదర్శనతో తీవ్ర విమర్శలపాలైన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వ్యవహారంపై కూడా రైనా స్పందించాడు. అతనికి సీనియర్ల గైడెన్స్ అవసరం ఉందన్నాడు. కెరీర్ ప్రారంభంలో యువరాజ్ సింగ్ తనకు అండగా ఉండేవాడని రైనా గుర్తు చేసుకున్నాడు.
‘రిషభ్ పంత్ చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడు. జట్టులో ఎవరో ఒకరు అతనికి అండగా ఉంటూ గైడెన్స్ ఇవ్వాలి. నేను ఆడే రోజుల్లో యూవీ పా నాకు అండగా ఉండేవాడు. నువ్వు తప్పులు చేస్తే మేం సరిదిద్దుతామని చెప్పేవాడు. అలాంటి గైడెన్స్ రిషభ్‌కు కావాలి. పంత్ ఏం సాధా సీదా ఆటగాడు కాదు. విదేశాల్లో సెంచరీలు చేశాడు. అయితే ఎక్కడో ఏదో అతను కోల్పోతున్నాడనిపిస్తుంది'అని రైనా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications