Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: రవీంద్ర జడేజా కోసం తెలుగోడిని తప్పించాలా? ఇలా అయితే టెస్ట్‌లు ఎవరు ఆడరు!

India vs Australia: Why Hanuma Vihari Will Be The Fall Guy As India Look Set To Play Ravindra Jadeja

హైదరాబాద్: 'హనుమ విహారి.. దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాదిరి టెస్ట్ స్పెషలిస్ట్. జట్టులో ఉండాలంటే అతను ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిందే. తను విఫలమైనా.. జట్టు బాగా ఆడకపోయినా ముందుగా మూల్యం చెల్లించుకోవాల్సింది విహారినే'ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు భారత మాజీ స్పిన్నర్, మరో తెలుగు తేజం ప్రజ్ఞాన్ ఓఝా చేసిన కామెంట్ ఇది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఓఝా చెప్పిన మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. రెండో టెస్ట్‌లో హైదరాబాదీ హనుమ విహారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోసం విహారి ప్లేస్‌కు ఎసరు పెట్టాలని చూస్తున్నారు.

ఐదుగురు బౌలర్ల వ్యూహం..

ఐదుగురు బౌలర్ల వ్యూహం..

మెల్‌బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్‌లో ఐదుగురు బౌలర్ల ప్లాన్‌తో బరిలోకి దిగేందుకు హనుమ విహారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంకషన్ గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజాను తీసుకునేందుకు ఈ హైదరాబాద్ టెస్ట్ స్పెషలిస్ట్ పక్కనబెట్టే ఆలోచన టీమ్‌మేనేజ్‌మెంట్ చేస్తోందని సమాచారం. పైగా గౌతం గంభీర్, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా విహారిపై వేటు వేసి జడేజాను తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.

అయితే వన్డే సిరీస్‌తో పాటు ఫస్ట్ టీ20లో అద్భుతంగా ఆడిన జడేజా ఇప్పటి దాకా 49 టెస్ట్‌లాడి 35 సగటుతో 1869 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గత పర్యటనల్లో అతను హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు 10 టెస్ట్‌ల అనుభవం ఉన్న విహారి 33 ప్లస్ యావరేజ్‌తో 567 రన్స్ చేశాడు. వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన అతని ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇది అన్యాయం..

ఇది అన్యాయం..

అయితే జడేజా కోసం హనుమ విహారిని తప్పించాలన్న ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో ఉన్న జడేజా రాక మంచిదే అయినా అతని కోసం టెస్ట్ స్పెషలిస్ట్‌ను కాదనుకోవడం, పైగా ఒక మ్యాచ్‌లో ఫెయిలైనంత మాత్రానా వేటు వేయడం సమంజసం కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ, పుజారా, రహానే మినహా అంతా విఫలమయ్యారు. అలాంటప్పుడు విహారినే టార్గెట్ చేయడం ఎందుకు? పైగా అతను టెస్ట్ స్పెషలిస్ట్. ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ కాలం కుర్రాళ్లంతా కాసులు కురిపించే షార్ట్ ఫార్మాట్‌పై దృష్టి పెడితే తను మాత్రం కెరీర్ స్టార్టింగ్‌లోనే లిమిటెడ్ ఓవర్లపై కాకుండా టెస్ట్‌లను నమ్ముకున్నాడు. ఒకవేళ ఎక్స్‌ట్రా బౌలర్ కావాలనుకుంటే తను కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఫిఫ్త్ బౌలర్‌గా కచ్చితంగా పనికొస్తాడు. ఆ విషయాన్ని తన అరంగేట్రం మ్యాచ్‌లోనే నిరూపించుకున్నాడు.

స్వదేశంలో ఎలాగూ చాన్స్ ఉండదు..

స్వదేశంలో ఎలాగూ చాన్స్ ఉండదు..

స్వదేశంలో ఎలాగూ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో ఆడుతారు కాబట్టి విహారికి అవకాశం తక్కువ. ఈ లెక్కన నాలుగైదు విదేశీ పర్యటనల కోసం పుజారా మాదిరిగా విహారి కూడా ఏడదంతా కష్టపడుతూ ఎదురు చూస్తున్నాడు. మంచి టెక్నిక్, టాలెంట్‌తో పాటు టెస్ట్ మ్యాచ్‌లకు కావాల్సిన ఓపిక హైదరాబాదీ ప్లేయర్ సొంతం. ఒకవైపు రెండో టెస్ట్‌లో విహారి ఓపెనర్‌గా లేదంటే కోహ్లీ గైర్హాజరీలో ఖాళీ అయ్యే నాలుగో ప్లేస్‌లో బరిలోకి దింపాలని మాజీలు సూచన చేస్తుండగా మేనేజ్‌మెంట్ మాత్రం అసలు టీమ్ నుంచే తీసేయాలన్న ఆలోచన చేయడం ఏ మాత్రం మంచిది కాదు. జడేజా మంచి ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ విహారి మాదిరి ప్రశాంతంగా ఇన్నింగ్స్ నిర్మించగలిగే సత్తా అతనిలో ఉందా? అంటే ఔనని చెప్పలేం.

మరొక స్పిన్నర్ అవసరమా?

మరొక స్పిన్నర్ అవసరమా?

పైగా అశ్విన్ రూపంలో ఇప్పటికే టీమ్‌లో ఓ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. సహజంగానే పేస్‌కు అనుకూలించే మెల్‌బోర్న్ పిచ్‌పై ఇద్దరు స్పిన్నర్లు అవసరమా? అనే ప్రశ్న వస్తుంది. అలాంటప్పుడు విహారిని వదులుకోవడం ఎందుకో? అనిపిస్తోంది. జడేజాను కచ్చితంగా ఆడించాలని అనుకుంటే కోహ్లీ ప్లేస్‌ను అతనితో భర్తీ చేస్తే సరిపోతుంది. గత ఆసీస్ పర్యటనలో కూడా విహారికి నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలోనే అవకాశం దక్కింది. తన విఫలమైనా, టీమ్ బాగా ఆడకపోయినా ఇలా వేటు వేస్తామంటే అతని కాన్ఫిడెన్స్ కచ్చితంగా దెబ్బతింటుంది. మంచి ఫ్యూచర్ ఉన్న ఓ టెస్ట్ స్పెషలిస్ట్‌ను ఇలా ట్రీట్ చేస్తే టెస్ట్‌లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఎలా ముందుకు వస్తారు? అనే సందేహం తలెత్తుతుంది.

పృథ్వీషాకు మరో చాన్స్ ఇవ్వాలి.. అండగా ఉన్నామనే భరోసా కల్పించాలి: ఆసీస్ మాజీ క్రికెటర్

Story first published: Tuesday, December 22, 2020, 16:35 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+