మా హృదయాల్లో సజీవంగా ఉన్నావ్ బ్రో..
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో న్యాయం జరుగుతుందని ట్వీటర్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రభుత్వంపై తనకు ఆ నమ్మకం ఉందని తెలిపాడు. ‘సుశాంత్ బ్రో నీవు ఎప్పుడూ మా హృదయాల్లో సజీవంగా ఉంటావు. మీ అభిమానులు మిమ్మల్ని చాలా మిస్సవుతున్నారు. ఈ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు త్వరలోనే న్యాయం దొరుకుతుంది. మీ ఆత్మహత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. మీరు మా అందరికి స్పూర్తి'అని రైనా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జత చేశాడు. సుశాంత్ అభిమానులు ట్రెండ్ చేస్తున్న హాష్ ట్యాగ్ తో రైనా కూడా ట్విట్ చేసాడు.

రోజుకో మలుపు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న జూన్ 14న ఏం జరిగింది అనే దానిపై హౌస్ కీపర్ హౌస్‌కీపర్ నీరజ్ సింగ్ సీబీఐ విచారణలో కీలకాంశాలు వెల్లడించాడు. మరోవైపు సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

సుశాంత్ సింగ్ కు సైకలాజికల్ అటాప్సీ..
సుశాంత్ మరణం వెనుక గల కారణాల వెలికితీతకు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సైకలాజికల్ అటాప్సీ చేయాలని నిర్ణయించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ అటాప్సీ జరుగనుంది. సైకలాజికల్ అటాప్సీ అంటే, అతని మనసును పోస్టుమార్టం చేయడమే. ఇందులో భాగంగా సుశాంత్ జీవితంలో జరిగిన అన్ని ఘటనలనూ సీబీఐ విశ్లేషించనుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించి, ఆయన మానసిక స్థితిని అంచనా వేస్తుంది. ఆయన ఎలా నడచుకునేవారు? ఎలా ఉండేవారు? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఆయన మానసిక స్థితి ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.

రిటైర్మెంట్‌తో షాకిచ్చిన రైనా..
ధోనీ, రైనా చడిచప్పుడు లేకుండా సింపుల్‌గా ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేయగా.. 'నీతో కలసి ఆడడం కంటే ఏదీ గొప్ప కాదు. నీతో కలసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా. భారతావనికి ధన్యవాదాలు.. జైహింద్'అని రైనా ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్‌లో ఉన్న రైనా.. క్యాష్ రిచ్ లీగ్ కోసం సిద్దమవుతున్నాడు.
IPL 2020: ఐపీఎల్ సెంట్రల్ స్పాన్సర్ దొరికిందోచ్.. రూ.130 కోట్లకు‘అన్ అకాడమీ'తో ఒప్పందం!


Click it and Unblock the Notifications












