Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముందు బిచ్చమెత్తుకుంటున్న నీ దేశానికి ఏదైనా చేయ్.. అఫ్రిదిపై సురేశ్ రైనా ఫైర్!

Suresh Raina hits back at Shahid Afridi over his Kashmir remarks

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత క్రికెటర్లు తిప్పికొడుతున్నారు. ఇప్పటికే గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ గట్టి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా సురేశ్ రైనా కూడా ఆ జాబితాలో చేరాడు. ముందు అతని ఫెయిల్యూర్ దేశానికి ఏదైనా చేయాలని సూచిస్తూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. తాను గర్వించదగిన కశ్మీర్‌నని, అది ఎప్పుడు భారత అంతర్భాగంలోనే ఉంటుందని ట్వీట్ చేశాడు.

కరోనా బాధితులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న అఫ్రిది ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించాడు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైన్య బలగం ఎంత ఉందో.. అంతమంది భారత సైనికులను మోదీ కశ్మీర్‌లో మోహరించారని, అతని మనసులో కరోనాను మించిన వ్యాధి ఉందని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు.

పీఎస్‌ఎల్‌లో కశ్మీర్ టీమ్..

అంతేకాకుండా కశ్మీర్ ప్రజలు చూపించిన ప్రేమకు తాను ముగ్దుడైననట్లు తెలిపాడు. వచ్చే సీజన్ పీఎస్‌ఎల్‌లో కశ్మీర్ టీమ్ కూడా వస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ఒకవేళ కశ్మీర్ టీమ్ వస్తే మాత్రం ఆ జట్టు తరఫున ఆడుతానని తెలిపాడు. అయితే అఫ్రిది మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో అఫ్రిది డైలాగ్‌లకు పాక్ సైన్యం జేజేలు పలికింది. ఈ వీడియోతో అఫ్రిదిపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అఫ్రిది కూడా కశ్మీర్‌లు వేదనకు గురికావడానికి మతం అడ్డుకాకుడదని, మంచి మనస్సుతో ఆలోచించి కశ్మీర్‌ను రక్షించాలని ట్వీట్ చేశాడు.

నీ ఫెయిల్యూర్ దేశానికి..

నీ ఫెయిల్యూర్ దేశానికి..

ఇక అఫ్రిది కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రైనా ఘాటుగా బదులిచ్చాడు. కశ్మీర్‌ను వదిలేసి.. ఇతర దేశాల వద్ద బిచ్చమెత్తుకుంటున్నా పాకిస్థాన్‌ను చూసుకోవాలని ట్విటర్ వేదికగా చురకలంటించాడు. ‘ముందు బిక్షమెత్తుకుంటున్న.. విఫలమైన నీ దేశానికి ఏమైనా చేయ్. కశ్మీర్ ఒంటరిగా వదిలేయ్. గర్వించదగిన కశ్మీర్‌గా చెబుతున్నా అది ఎప్పుడు భారత్‌లో అంతర్బాగమే. జై హింద్'అని ట్వీట్ చేశాడు.

అఫ్రిదితో కటీఫ్..

అఫ్రిదితో కటీఫ్..

ఇక అంతకుముందు టీమిండియా స్టార్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ అఫ్రిది వ్యాఖ్యలను ఖండించారు. అతని వ్యాక్యలను వారిని బాధించాయని, అఫ్రిది అడగ్గానే మానవతా దృక్పథంతో సాయం చేశామని, కానీ అతను హద్దులు దాటి మాట్లాడాడని, ఇక అతనితో తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఇక అఫ్రిది ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని హర్భజన్, యువరాజ్ సింగ్ భారత అభిమానులను కోరి విమర్శలపాలయ్యారు.

అఫ్రిది తాజా వ్యాఖ్యలతో భారత నెటిజన్లు వీరిపై మరోసారి మండిపడుతున్నారు. మన డబ్బుతో మనకే ఎసరు పెడుతున్నాడని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం ఈ పాకిస్థానోళ్లని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ ఎప్పటికీ తమదేనని, 22కోట్ల మంది సైన్యాన్ని తీసుకొచ్చినా సరే, తమ వాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానమని ధావన్ ట్వీట్ చేశాడు.

బంగ్లాదేశ్ గుర్తులేదా..?

బంగ్లాదేశ్ గుర్తులేదా..?

అఫ్రిది అనుచిత వ్యాఖ్యలపై గంభీర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. ఆ దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?' అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.

ఆ మ్యాచ్‌లో సచిన్ 98 రన్స్‌కు ఔటవ్వడం బాధించింది: అక్తర్

Story first published: Monday, May 18, 2020, 14:40 [IST]
Other articles published on May 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+