ధోనీ బాటలోనే సురేశ్ రైనా.. 74వ స్వాతంత్ర్య దినోత్సవం.. ‘73’కు అల్విదా!

న్యూఢిల్లీ: దశాబ్దకాలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు కీలక సేవలందించిన సూపర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా కూడా ధోనీ వెంటే నడిచాడు. మహీకి సన్నిహితునిగా ఉన్న రైనా.. వీడ్కోలులోనూ అతడినే అనుసరించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే అతను కూడా అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు. 'నీతో కలసి ఆడడం కంటే ఏదీ గొప్ప కాదు. నీతో కలసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా. భారతావనికి ధన్యవాదాలు.. జైహింద్'అని రైనా రాసుకొచ్చాడు.
అయితే, వచ్చే నెలలో జరగనున్న ఐపీఎల్‌లో మాత్రం రైనా ఆడనున్నాడు. ఈ ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని చెప్పిన రైనా ఇంతలోనే వీడ్కోలు పలకడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. రీఎంట్రీ కోసమే కదా సొంతమైదానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో రైనా ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
భారత్ 73 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకొని 74వ ఏడాదిలోకి అడుగు పెట్టిన రోజునే '7' నెంబర్ జెర్సీ గల ధోనీ, '3' నెంబర్ జెర్సీ గల రైనా రిటైరవడంతో అభిమానులు ఈ రెండు అంశాలకు (73-7,3) పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నారు.

శ్రీలంకపై మొదలు పెట్టి..
2010లో శ్రీలంకపై తొలి టెస్ట్ ఆడిన రైనా.. మొత్తం 18 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 26.48 యావరేజ్‌తో 768 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2015లో ఆసీస్‌పై చివరి టెస్ట్ ఆడాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత కీలక ప్లేయర్‌గా ఎదిగిన రైనా.. 226 మ్యాచ్‌లు ఆడాడు. 35.31 సగటుతో 5615 రన్స్ చేశాడు. 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక(2005)పై తొలి వన్డే ఆడిన ఈ యూపీ బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ (2018)తో ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇక 78 టీ20లు ఆడిన రైనా 1605 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆఫ్ బ్రేక్ బౌలర్‌గానూ రైనా తన సేవలందించాడు. టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

సూపర్ ఫీల్డర్..
33 ఏళ్ల రైనా భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా నిలుస్తాడు. ఎంత క్లిష్టమైన క్యాచ్‌లనైనా ఒడుపుగా పట్టడంలో దిట్ట. ఫీల్డింగ్ సమయంలో అతడి వద్దకు బంతి వెళ్లిందంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ రన్స్ చేసేందుకు తటపటాయించాల్సిందే. అవసరమైనప్పుడు బంతితోనూ ఆదుకొనేవాడు. అలాగే మిడిల్డార్ బ్యాట్స్‌మన్‌గానూ రాణించాడు. టెస్ట్‌ల్లో రైనా అంతగా ఆకట్టుకోలేకపో యినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. పొట్టి ఫార్మాట్‌లో శతకం (101) బాదిన ప్లేయర్లలో రైనా ఒకడు. భారత జగజ్జేతగా నిలిచిన 2011 వరల్డ్‌క్‌పతో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టులో రైనా సభ్యుడు. 3 ఫార్మాట్లలోనూ శతకాలు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.

ప్రపంచకప్ విజయంలో..
‘కొన్ని విలువైన ఇన్నింగ్స్‌తో రైనా మాకు వరల్డ్‌కప్ సాధించిపెట్టాడు'టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వ్యాఖ్యలివి. ఇవి చాలు 2011లో భారత్ విశ్వ విజేతగా నిలవడంలో రైనా రోల్ ఏంటో చెప్పేందుకు. ఆ ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌ల్లో రైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. కెప్టెన్ ధోనీ.. యూసుఫ్ పఠాన్‌కు మొగ్గు చూపడంతో గ్రూప్ స్టేజ్‌లో ఆడలేదు. సెహ్వాగ్ గాయపడటంతో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో తొలి చాన్స్ వచ్చింది. అనంతరం క్వార్టర్స్ ఫైనల్‌కు యూసుఫ్ ప్లేస్‌లో తుది జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్ పోరులో 34 రన్స్ చేసిన రైనా.. పాక్‌తో జరిగిన సెమీఫైల్లో 36 పరుగులు చేశాడు. ఫీల్డర్‌గా వెలకట్టలేని భాగస్వామ్యం అందించాడు. 2015 ప్రపంచకప్‌లోనూ రైనా సత్తా చాటాడు. జింబాబ్వేతో 74 రన్స్ చేశాడు. పాక్‌తో జరిగిన పోరులో సెంచరీ కొట్టి మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫామెన్స్ చేశాడు.

పెద్ద తల.. చిన్న తల
ధోనీతో రైనాకు విడదీయరాని అనుబంధం ఉంది. టీమిండియాలో సురేష్ నిలదొక్కుకున్నాడంటే అంతా ధోనీ వల్లే. మహీ కూడా రైనాను తన కుడి భుజంగా భావించేవాడు. ఎక్కువగా అవకాశాలు రైనాకే ఇచ్చేవాడు. ఐపీఎల్‌లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరంభం నుంచి ఆడుతూనే ఉన్నారు. చెన్నై అభిమానులైతే మహీని పెద్ద తల అంటే.. రైనాను చిన్న తల అని పిలుచుకుంటారు. పదేళ్లపాటు వీరిద్దరూ ఐపీఎల్‌లో ఒకే టీమ్‌కు ఆడడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!