For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని వల్లే 2011 ప్రపంచకప్ గెలిచాం: సురేశ్ రైనా

Suresh Raina credits one player for India’s 2011 title win
Rishabh Pant as Dominant as Sehwag, Yuvraj And Reminds Rahul Dravid: Suresh Raina

న్యూఢిల్లీ: 2011 ప్రపంచకప్ విజయం భారత అభిమానులకు చిరస్మరణీయం. నాటి ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన విన్నింగ్ షాట్ అపురూపం. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ధోనీ సారధ్యంలో భారత జట్టు సగర్వంగా విశ్వకప్‌ను ముద్దాడింది. ఆ దృశ్యం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయింది.

 ఓపెనర్లు ఔటైనా..

ఓపెనర్లు ఔటైనా..

ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు వెంటనే ఔటైనా మ్యాచ్‌ను భుజాలకెత్తుకొని యువ క్రికెటర్ విరాట్ కోహ్లీతో గౌతం గంభీర్‌ చేసిన పోరాటం అద్భుతం. అలాగే టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్‌లో గొప్ప ప్రతిభ కనబర్చి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన యువరాజ్ సింగ్‌ను తక్కువ చేయలేం. 28 ఏళ్ల కలను నెరవేర్చడానికి జట్టులోని మిగతా ఆటగాళ్లు చూపిన పోరాట పటిమను మెచ్చుకోకుండా ఉండలేం.

 సచిన్ నిరీక్షణ..

సచిన్ నిరీక్షణ..

అయితే వీరంతా ఒక ఎత్తయితే.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మరో ఎత్తు. అప్పటికే 5 వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన సచిన్‌కు ఇది ఆరోది.. చివరిసారిది. ఇన్నేళ్ల అతడి నిరీక్షణ ఈసారైనా తీరాలని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. ప్రతీ ఆటగాడు ఆకాంక్షించాడు. అందరూ అనుకున్నట్టే ఆ క్షణం రానే వచ్చింది. శ్రీలంకపై భారత్ గెలవనే గెలిచింది. క్రికెట్ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌ను ధోనీ, యువరాజ్, రైనా, కోహ్లీ ఇలా ఆటగాళ్లంతా తమ భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పారు.

ఈ కమనీయమైన దృశ్యం ప్రతీ అభిమానిని కనువిందు చేసింది. భారత క్రికెట్ చరిత్రలో అపరూప ఘట్టంగా నిలిచిపోయింది.

సచిన్ లేకుంటే గెలిచే వాళ్లం కాదు..

సచిన్ లేకుంటే గెలిచే వాళ్లం కాదు..

అయితే తాజాగా టీమిండియా వెటరన్ ప్లేయర్, నాటి ప్రపంచకప్ టీమ్ మెంబర్ సురేశ్ రైనా ఈ అద్భుత క్షణాలను నెమరు వేసుకున్నాడు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి విజయం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్ లేకపోతే అసలు 2011 ప్రపంచకప్ గెలిచేవాళ్లమే కాదన్నాడు. మాస్టర్ ప్రశాంతతనే భారత్ విజయానికి కారణమని చెప్పుకొచ్చాడు.

 అతను మా రెండో కోచ్

అతను మా రెండో కోచ్

‘సచిన్ ప్రశాంత తత్వమే ప్రపంచకప్ గెలవడానికి ప్రధాన కారణం. కప్ గెలవగలమనే నమ్మకాన్ని సచినే మాలో నింపారు. ఆయన లేకపోతే కప్పు గెలవగలిగే వాళ్లం కాదు. జట్టులో రెండో కోచ్‌గా వ్యవహరించాడు' అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక ఆ టోర్నీలో టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేశాడు. ఇక యువరాజ్ బంతి, బ్యాట్‌తో మెరిసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు.

రాయుడు, ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్‌పై కనికరం చూపలేకపోయాం: ఎమ్మెస్కే ప్రసాద్

Story first published: Sunday, May 3, 2020, 20:17 [IST]
Other articles published on May 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+