రాయుడు, ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్‌పై కనికరం చూపలేకపోయాం: ఎమ్మెస్కే ప్రసాద్

న్యూఢిల్లీ: టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన కరుణ్ నాయర్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవడం హృదయ విదారకమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అతనిపై కనికరం చూపించలేకపోయామన్నాడు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకుపోవడం కూడా బాధాకరమని తెలిపాడు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తన పదవి కాలంలో ఈ రెండు తనను అత్యంత బాధపెట్టిన సందర్భాలని చెప్పుకొచ్చాడు. శనివారం డ్రీమ్ ఎలెవన్ ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ట్రిపుల్ సెంచరీ చేసినా..
2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఆ తర్వాత మూడు టెస్టులే ఆడి జట్టుకు దూరమయ్యాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత నాలుగు ఇన్నింగ్స్‌ల అనంతరం సెలెక్టర్లు అతనిపై వేటు వేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా స్పందించిన ఎమ్మెస్కే.. చీఫ్ సెలెక్టర్‌గా తన పదవీకాలం సంతృప్తికరంగానే సాగిందన్నాడు. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం తాను పశ్చాత్తాప పడుతున్నానని, అందులో మొదటిది కరుణ్ నాయర్ అంశం అన్నాడు.

గుండె పగిలే విషయం..
‘ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా మేం అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేకపోయాం. నాయర్ జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు ఇవ్వాల్సింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలెక్ట్ చేసినా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ అనేది చాలా అరుదైన విషయం. కానీ, అలాంటి ఓ ప్లేయర్‌కు మరో చాన్స్ ఇవ్వలేకపోవడం అతనికే కాదు మాకు కూడా గుండె పగిలే విషయం' అని ఎమ్మెస్కే చెప్పాడు.

రాయుడు విషయం కూడా..
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడం కూడా బాధాకరమని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. చివరి క్షణం వరకూ రేసులోనే ఉన్న అంబటికి చాన్స్ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. ఈ విషయంలో తన నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బాధపడాలని అభిప్రాయపడ్డాడు. అలాగే, భారత టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పించడం పట్ల కూడా పశ్చాతాపడుతున్నానని ఎమ్మెస్కే చెప్పాడు.
‘చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరినీ పక్కనపెట్టి కుల్దీప్, చహల్‌ను తీసుకొచ్చాం. ఈ నిర్ణయం వల్ల జట్టుకు మంచి జరిగినా.. అప్పటికే టెస్టుల్లో నంబర్ 1,2 ర్యాంకుల్లో ఉన్న అశ్విన్, జడేజాను వన్డే టీమ్‌ను తప్పించామన్న విషయం మరిచిపోకూడదు' అని అన్నాడు.

రాహుల్ వల్ల.. ధోనీకి సవాలే..
ధోనీ ఈ ఐపీఎల్‌లో ఆడాలని అందరిలాగే తాను కూడా కోరుకున్నానని చెప్పాడు. విరామం తర్వాత గ్రౌండ్‌లో మహీ మునుపటి మెరుపులు చూడాలని అనుకున్నామన్నాడు. ఇప్పుడు లోకేశ్ రాహుల్ కూడా కీపర్‌గా బాగా రాణిస్తుండడంతో టీమిండియాలో రీఎంట్రీ ధోనీకి సవాల్‌గా మారిందని అభిప్రాయపడ్డాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను మూడు ఫార్మాట్లలో ఆడించడం ఛీఫ్ సెలెక్టర్‌గా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాలని చెప్పుకొచ్చాడు.
ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్ అని లక్ష్మణ్‌పై అరిచా.. తర్వాత మా అన్నయ్య తిట్టాడు: సచిన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications