
190 పరుగుల భారీ లక్ష్యం..
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదర్ అలీ, హఫీజ్ సూపర్ ఫిఫ్టీలతో పాటు కెప్టెన్ బాబర్ అజామ్(21) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీయగా.. మోయిన్ అలీ, టామ్ కరన్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
టామ్ బాంటన్(46), మోయిన్ అలీ(61) చెలరేగిన ఫలితం లేకపోయింది. ప్రత్యర్థి బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, వహాబ్ రియాజ్ రెండేసి వికెట్లు తీయగా... ఇమాద్ వాసిమ్, హారీస్ రౌఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ హఫీజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

ఆఖరి బంతికి సిక్స్ కొట్టలేక..
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా ధీటుగానే బదులిచ్చింది. మోయిన్ అలీ(61), టామ్ బాంటన్(46) జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. చివర్లో పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడి పెరిగి వికెట్లు చేజార్చుకున్నారు. ఇక చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. టామ్ కరన్ సిక్స్ కొట్టి ఆశలు రెకెత్తించాడు. కానీ ఆఖరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కే క్రమంలో డాట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.

అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ ..
ఈ మ్యాచ్‌తో పాక్ యువ సంచలనం హైదర్ అలీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కెరీర్ ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో రాణించి అద్భుత రికార్డు అందుకున్నాడు. పాక్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. పాక్ తరఫున ఉమర్ అమిన్ అరంగేట్ర టీ20 మ్యాచ్‌లో 47 రన్స్ చేశాడు. ఇదే ఇప్పటివరకు అత్యధికం. అంతేకాకుంగా ఇంగ్లండ్ గడ్డపై హాఫ్ సెంచరీ సాధించిన తొలి టీనేజ్ క్రికెటర్‌గా 19 ఏళ్ల 335 రోజుల వయసుల గల అలీ ఘనతను అందుకున్నాడు. అంతకు ముందు ఉమర్ అక్మల్ 20 ఏళ్ల 40 రోజుల వయసులో బర్మింగ్ హోమ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 64 రన్స్ చేశాడు.

హఫీజ్ హ్యాట్రిక్ ఫిఫ్టీ..
ఇక మహ్మద్ హఫీజ్ రెండు సార్లు హ్యాట్రిక్ ఫిఫ్టీ ప్లస్ పరుగులతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి పాక్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2012-13 సీజన్‌లో కూడా హఫీజ్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ మూడు సార్లు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించగా.. విండీస్ వీరుడు క్రిస్ గేల్ రెండు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు.
సీఎస్‌కే సీఈవో మరో ట్విస్ట్.. ఆ 13 మందికి పాజిటీవ్.. రైనా తిరిగి వస్తాడనే ఆశాభావం!


Click it and Unblock the Notifications
