Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్!

Sunrisers Hyderabad to repeat 2016 sentiment to win IPL 2020 ?
IPL 2020,KKR vs SRH : Sunrisers Hyderabad To Repeat 2016 Sentiment To Win IPL 2020

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2020 సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస మ్యాచ్‌ల్లో ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గెలుపు ముంగిట చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యంతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది.

టాపార్డర్‌ విఫలమవడం.. మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో డేవిడ్ సేన ఏం చేయలేకపోతుంది. అయితే ఈ వరుస ఓటములు మంచికే అంటున్నారు కొందరు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. సెంటిమెంట్స్‌ను బాగా నమ్మె తెలుగు ప్రేక్షుకులు.. 2016 హిస్టరీ రిపీట్ అవుతుందని జోస్యం చెబుతున్నారు.

ఆ సెంటిమెంట్ ఏంటంటే..?

డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో తొలి టైటిల్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఏకంగా ఫైనల్ చేరి.. టోర్నీ ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ సీజన్‌లో జట్టు బ్యాటింగ్ బాధ్యతలను డేవిడ్ వార్నర్ మోయగా.. బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో విజయాలు అందించారు. అయితే 2016 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. అది కూడా ఆర్‌సీబీ, కేకేఆర్‌తోనే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న అభిమానులు..ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటిలానే బెంగళూరు చేతిలో..

ఇప్పటిలానే బెంగళూరు చేతిలో..

2016 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన తమ అరంగేట్ర మ్యాచ్‌లో హైదరాబాద్ 45 రన్స్‌తో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ(75), డివిలియర్స్(82) చెలరేగారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసింది. వార్నర్(58) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్‌లో కూడా ఆర్‌సీబీ విధించిన 164 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ చేజ్ చేయలేకపోయింది. బెయిర్ స్టో(61) పోరాడినా ఫలితం లేకపోయింది.

కోల్‌కతాతో కూడా..

కోల్‌కతాతో కూడా..

ఇక 2016 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్లతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్లకు 142 పరుగులు చేయగా.. అప్పుడు హైదరాబాద్ జట్టులో ఉన్న ఇయాన్ మోర్గాన్(51), నమాన్ ఓజా(37) రాణించారు. అనంతరం కేకేఆర్ 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసి విజయాన్నందుకుంది. నాటి కేకేఆర్ కెప్టెన్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా ఇవే పరిస్థితులు రిపీట్ అయ్యాయని అభిమానులు గుర్తు చేస్తున్నారు. అప్పటిలానే 145 పరుగులే చేసిందని, మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేశాడని గుర్తు చేస్తున్నారు. ఛేజింగ్‌లో అప్పుడు గంభీర్ ఆడితే.. ఇప్పుడు శుభ్‌మన్ ఆడాడంటున్నారు.

హ్యాట్రిక్ విజయాలతో..

హ్యాట్రిక్ విజయాలతో..

2016 సీజన్‌లో ఈ రెండు మ్యాచ్‌లు అనంతరం వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన హైదరాబాద్.. మొత్తం 8 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్‌కు చేరింది. ఎలిమినేటర్1లో కోల్‌కతాను ఓడించిన హైదరాబాద్.. క్వాలిఫయర్‌లో గుజరాత్‌కు చెక్ పెట్టి ఫైనల్ చేరింది. టైటిల్ ఫైట్‌లో భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్‌సీబీని ఓడించి చాంపియన్‌గా. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అభిమానులు జోస్యం చెబుతున్నారు. రాబోయే మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక డేవిడ్ సేన తమ తదుపరి మ్యాచ్‌ను మంగళవారం పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

అప్పుడు, ఇప్పుడు వార్నరే

అప్పుడు, ఇప్పుడు వార్నరే

అంతేకాకుండా టైటిల్ గెలిచినప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను డేవిడ్ వార్నర్ లీడ్ చేసాడని, మళ్లీ రెండు సీజన్ల తర్వాత మళ్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడని, ఇది కూడా ఆరెంజ్ ఆర్మీ టైటిల్ గెలవడాని ఓ కారణమంటున్నారు. ఇక బాల్‌ట్యాంపరింగ్ నిషేధంతో వార్నర్ 2018 సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. 2019 సీజన్‌లో ఆడినా జట్టుకు సారథ్యం వహించలేదు. ఈ రెండు సీజన్లలో జట్టును లీడ్ చేసిన విలియమ్సన్ 2018లో ఫైనల్‌కు, 2019లో ప్లే ఆఫ్‌కు చేర్చాడు. మళ్లీ వార్నర్‌కు జట్టు పగ్గాలు అందించడం కూడా ఆరెంజ్ ఆర్మీకి కలిసి వస్తుందంటున్నారు. ఇక 2017లో వార్నరే కెప్టెన్‌గా ఉన్నప్పటికి హైదరాబాద్ ప్లే ఆఫ్‌కే పరిమితమైంది.

సాహా బంతులన్నీ స్వాహా.. శుభ్‌మన్ ఫిఫ్టీతో సచిన్ ఇంట సంతోషం.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్

Story first published: Sunday, September 27, 2020, 12:48 [IST]
Other articles published on Sep 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+