సాహా బంతులన్నీ స్వాహా.. శుభ్‌మన్ ఫిఫ్టీతో సచిన్ ఇంట సంతోషం.. నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో దారుణ ఓటమికి గురైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా నెమ్మదైన బ్యాటింగ్‌తో ఓటమికి కారణమైన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ వృద్ధీమాన్ సాహాను ఓ ఆట ఆడుకుంటున్నారు. అలాగే అజేయ హాఫ్ సెంచరీతో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ మీమ్స్, కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. కేకేఆర్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 7 వికెట్లతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. కోల్‌కతాకు తొలి విజయం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు.
ఏమయ్యా సాహా..? ఏందీ ఈ బంతుల స్వాహా.?
విజయ్ శంకర్ గాయంతో తుది జట్టులోకి వచ్చిన వృద్ధీమాన్ సాహా.. నిరాశజనక ప్రదర్శన కనబర్చాడు. మనీష్ పాండేకు అండగా నిలిచినప్పటికీ.. టీ20 ఫార్మాట్‌కు కావాల్సిన మెరుపులను మెరిపించలేకపోయాడు. 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. వన్డే తరహాలో అతని బ్యాటింగ్ కొనసాగడంతో హైదరాబాద్ స్వల్ప స్కోర్‌కే పరిమితమై ఓటమి పాలైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నెటిజన్లు సాహాపై మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. సాహాకు టెస్ట్ టీమ్‌లో చోటు పక్కా అని ఒకరంటే.. తన బ్యాటింగ్ స్టైల్‌ను సాహా కాపీ కొట్టాడని ధోనీ బాధపడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇక సాహా ఆటను రిషభ్ పంత్ త్రీడీ గ్లాసెస్‌లో చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.
సచిన్ ఇంట సంతోషం..
ఇక కేకేఆర్‌ను సూపర్ ఫిఫ్టీతో గెలిపించిన శుభ్‌మన్ గిల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతనికి మంచి భవిష్యత్తు ఉందని, ఇలానే స్థిరంగా ఆడితే భారత కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉందని కొనియాడుతున్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం నడుస్తుందన్న రూమర్స్ నేపథ్యంలో ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. శుభ్‌మన్ ఫిఫ్టీతో సచిన్ ఇళ్లంతా సంతోషంగా ఉందని, తమ అల్లుడి ఆటతో మాస్టర్ ఉప్పొంగిపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇక సారా ఆనందానికి హద్దే లేకుండా పోయిందని, గత మ్యాచ్‌లో సూపర్ ఫీల్డింగ్‌కే తెగ సంతోషపడిన సచిన్ కూతురు.. ఈ సూపర్ ఫిఫ్టీతో ఏం చేసిందోనని సెటైర్స్ పేల్చుతున్నారు.
ఇది టీ20నా లేక టెస్ట్?
ఇక గత 6 మ్యాచ్‌ల్లో ధనాధన్ సిక్సర్లు, ఫోర్లను చూసిన అభిమానులు హైదరాబాద్-కేకేఆర్‌పై పెదవి విరుస్తున్నారు. ఎలాంటి మెరుపులు లేకుండా నిరాశజనకంగా సాగిన మ్యాచ్‌ను చూసి బోర్‌గా ఫీలయ్యామని కామెంట్ చేస్తున్నారు. అసలు ఇది టెస్ట్‌నా లేక టీ20నా అనే సెటైర్లు పేల్చుతున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు దూకుడు పెంచుతున్న దశలో తెలుగు కామెంటేటర్లు.. వారి బ్యాటింగ్ ప్రతిభ గురించి మాట్లాడగా తర్వాత బంతికే వారు ఔటయ్యారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.‘మీ కామెంట్రీ ఆపండ్రా బాబోయ్' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
కోల్‌కతాకు ‘శుబ్'మయం..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 ), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 30) మోస్తరుగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్, వరున్, రస్సెల్ తలో వికెట్ తీశారు. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 70 నాటౌట్), మోర్గాన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నటరాజన్, రషీద్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications