Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్ !

Sunrisers Hyderabad All-rounder Mitchell Marsh May Be Ruled Out of IPL 2020

న్యూఢిల్లీ: ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సీజన్ మోత్తానికి దూరమయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ సీజన్‌లో అతను మళ్లీ ఆడటం కష్టమేనని జట్టు వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 10 పరుగులతో గెలుపొంది ఐపీఎల్ 2020లో బోణీ కొట్టింది.

బంతిని ఆపే క్రమంలో..

బంతిని ఆపే క్రమంలో..

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్ వేయడానికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ నుంచి బంతిని అందుకున్న మిచెల్ మార్ష్ గాయం కారణంగా నాలుగు బంతుల్లోనే మైదానం వీడాడు. అతను వేసిన రెండో బంతిని ఆర్‌సీబీ ఓపెనర్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడగా.. దాన్ని ఆపే క్రమంలో మార్ష్ మడమ ట్విస్ట్ అయింది. నొప్పితో విలవిలలాడిన మార్ష్‌కు ఫిజియో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మరో రెండు బంతులేసిన మార్ష్‌‌కు నొప్పి మరింత ఎక్కువ కావడంతో మైదానం వీడాడు. మిగిలిన రెండు బంతులను విజయ్ శంకర్ పూర్తి చేశాడు. అయితే మార్ష్ నిలబడలేని స్థితిలో కూడా ఆఖరి బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.

మరో మ్యాచ్ ఆడటం కష్టమే..

మరో మ్యాచ్ ఆడటం కష్టమే..

నొప్పితో నిలబడలేకపోతున్న అతనికి ఆరోన్ ఫించి ఏబీ డివిలియర్స్ అండగా నిలిచారు. చివరకు ఫిజియో సాయంతో మార్ష్ మైదానం దాటాడు. అయితే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, మళ్లీ బరిలోకి దిగుతాడని అనుకోవడం లేదని టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి పీటీఐకి తెలిపాడు. అయితే మార్ష్ గాయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మిచెల్ మార్ష్‌కు సీజన్‌‌మొత్తానికి దూరమైతే సన్‌రైజర్స్ కష్టాలు తప్పవు. కాకపోతే మహ్మద్ నబీ రూపంలో బ్యాకప్ ఉండటం సన్‌రైజర్స్ ప్లస్ పాయింట్. గాయంతో కూడా బ్యాటింగ్‌ చేసిన మిచెల్‌ను మెచ్చుకోవాల్సిందేనని డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. కనీసం నిలబడలేని స్థితిలో జట్టు కోసం సాహసం చేశాడని కొనియాడాడు.

అదరగొట్టిన ఆర్‌సీబీ

అదరగొట్టిన ఆర్‌సీబీ

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. పడిక్కల్, ఏబీడి చెలరేగగా.. ఆరోన్ ఫించ్(27 బంతుల్లో 29) ఫర్వాలేదనపించాడు. విరాట్ కోహ్లీ(14) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.

అనంతరం చేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. బెయిర్‌స్టో(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) ఉన్నంతసేపు బెంబేలెత్తించినా ఫలితం లేకపోయింది. డేవిడ్ వార్నర్(6) అన్‌లక్కీగా రనౌట్ కాగా.. మనీష్ పాండే(34) ఫర్వాలేదనపించాడు. ఇక ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్(3/18) ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించగా.. నవదీప్ సైనీ, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీశారు. డేల్ స్టెయిన్‌కు ఒక వికెట్ దక్కింది. విజయంలో కీలకపాత్ర పోషించిన చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్ల సందడి.. బాగా ఆడాడని కోహ్లీని ఎగతాళి చేసిన డివిలియర్స్!(వీడియో)

Story first published: Tuesday, September 22, 2020, 13:11 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+