Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్ల సందడి.. బాగా ఆడాడని కోహ్లీని ఆటపట్టించిన డివిలియర్స్!(వీడియో)

Ab De Villiers trolls Virat Kohli after SRH vs RCB match in Dressing room

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 10 పరుగులతో గెలుపొందింది. తొలుత అరంగేట్ర ఆటగాడు దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 8 ఫోర్లతో 56), మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపడం.. తర్వాత యుజ్వేంద్ర చాహల్(3/18) స్పిన్‌తో మ్యాజిక్ చేయడంతో అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఈ విజయానంతరం ఆర్‌సీబీ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డ్రెస్సింగ్ రూంలో ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు.

కోహ్లీని ఆటపట్టించిన ఏబీడీ..

తమ ఆనందాన్ని ఆర్‌సీబీ యూట్యూబ్‌చానె‌ల్‌తో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ(14)ని డివిలియర్స్ ఆటపట్టించాడు. తన మార్క్ పెర్ఫామెన్స్‌తో బెస్ట్ స్ట్రైక్‌రేట్, సూపర్ సిక్స్ అవార్డులను అందుకున్న ఏబీడీ తనకు వచ్చిన ట్రోఫీని కోహ్లీకి అందజేస్తూ.. అద్భుతంగా ఆడాడని, చాలా ఎక్కువ పరుగులు చేశాడని ఎగతాళి చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. దీనికి కోహ్లీ ‘నేనా.. కాదు కాదు'అని బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూసాయి. ఇక తాను, ఏబీడీ ఎప్పుడూ వరసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదని కానీ, గత సీజన్‌లో తమకు ఈ పరాభావం ఎదురైందని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

163 పరుగుల కాపాడుకోవడం అద్భుతం..

163 పరుగుల కాపాడుకోవడం అద్భుతం..

ఇక 163 పరుగులను కాపాడుకోవడం అద్భుతమని డివిలియర్స్ అన్నాడు. గతంలో భారీ టార్గెట్‌లను కూడా చేజార్చుకున్నామని, ఈ సీజన్‌లో సరైన ట్రాక్‌లో వెళ్తున్నామన్నాడు. చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పాడన్నాడు. అలాగే శివమ్ దూబే, నవదీప్ సైనీ, స్టెయిన్ సూపర్‌గా బౌలింగ్ చేశారని కొనియాడాడు. పడిక్కల్ బ్యాటింగ్ అద్భుతమని, అతనికి మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసించాడు.

ప్రతికూల పరిస్థితుల్లో..

ప్రతికూల పరిస్థితుల్లో..

ప్రతికూల పరిస్థితుల్లో గెలవడం చాలా సంతోషంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మంచు ప్రభావం కారణంగా బంతి పట్టు చిక్కదని, బంతి సులువుగా బ్యాట్‌పైకి వెళ్తుందన్నాడు. ఢిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌లో అదే జరిగిందని, కానీ తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడు. లైన్ తప్పకుండా రిథమ్‌‌తో ప్రత్యర్థి కట్టడి చేశారన్నాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్‌ను తమవైపు తిప్పాడని, అతను తమకు చాలా కీలకమని తెలిపాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన పడిక్కల్‌ను మెచ్చుకున్నాడు.

చాలా సంతోషంగా ఉంది..

చాలా సంతోషంగా ఉంది..

ఇక అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందని దేవదూత్ పడిక్కల్ తెలిపాడు. గత సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఎదుర్కొందని, ఆ సమస్యను తీర్చాలని తాను భావించినట్లు ఈ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామన్నాడు. ఇక తమ జట్టు అద్భుతంగా ఉందని, తొలి మ్యాచ్‌లో గెలవడం చాలా సంతోషంగా ఉందని సైనీ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీడీ సూచనలతో తాను మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశానని చాహల్ పేర్కొన్నాడు.

అందుకే కేన్ విలిమయ్సన్‌ను తీసుకోలేదు: డేవిడ్ వార్నర్

Story first published: Tuesday, September 22, 2020, 12:33 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+