భారత్-పాక్ సిరీస్ అసంభవం: సునీల్ గావస్కర్

న్యూఢిల్లీ: కరోనా విరాళల కోసం భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ సిరీస్ జరగడం అసంభవమని తెలిపాడు.పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా యూట్యూబ్ చానెల్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన లిటిల్ మాస్టర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ప్రస్తుతం చాలా కష్టం..
సమీప భవిష్యత్తులో భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ జరగడం కన్నా లాహోర్‌లో మంచు వర్షం కురిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. ఇరు జట్లు ప్రపంచకప్, ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ సిరీస్ జరగడం కష్టమన్నాడు.
‘భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ కన్నా లాహోర్‌లో మంచు వర్షం కురిసే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇరు జట్లు ప్రపంచకప్, ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య సిరీస్ జరగడం అసంభవం.'అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
యూవీ ఫౌండేషన్‌కు విరాళమిస్తే.. మా దేశంలో నన్నెవరూ ప్రశ్నించలేదు: అఫ్రిది

మాకు ఆ కర్మ పట్టలేదు..
ఇప్పటికే అక్తర్ ప్రతిపాదనను టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సిరీస్‌ల ద్వారా వచ్చే డబ్బు భారత్‌కు అవసరం లేదని అక్తర్‌కు కపిల్ దేవ్ కౌంటర్ ఇచ్చాడు.. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్ల జీవితాలతో రిస్క్ చేయాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. తమ దగ్గర చాలినంత డబ్బు ఉందని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తమ అధికారులందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారని తెలిపాడు. ఇప్పటికే బీసీసీఐ రూ.51 కోట్లు విరాళంగా ఇచ్చిందని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందన్నాడు. ఇక అక్తర్ వ్యాఖ్యలు చాలా కామెడీగా ఉన్నాయని రాజీవ్ శుక్లా కొట్టిపారేశాడు.

ఫండ్ రైజింగ్ కోసం భారత్-పాక్ మ్యాచ్...
కరోనా సంక్షోభ సమయంలో ఫండ్ రైజింగ్ కోసం తటస్థ వేదికగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలని అక్తర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో పాటు ఆర్థిక సాయం లభిస్తుందని అభిప్రాయడ్డాడు. ఇక తన ప్రతిపాదనను వ్యతిరేకించిన కపిల్ వ్యాఖ్యలకు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ కౌంటర్ ఇచ్చాడు.
తన ఉద్దేశాన్నికపిల్ భాయ్ అర్థం చేసుకోలేదని, ప్రస్తుత యావత్ పరిస్థితుల్లో యావత్ ప్రపంచానికి డబ్బులు అవసరమని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తన ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక కపిల్ వ్యాఖ్యలను షాహిద్ అఫ్రిది కూడా తప్పుబట్టాడు. మానవత్వంతో అక్తర్ సలహా ఇస్తే.. కపిల్ ఇలా మాట్లాడుతాడనుకోలేదన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications