Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలా ఆడితే సంజూ శాంసన్‌కు తిరుగుండదు: సునీల్ గవాస్కర్

టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఓపికగా బ్యాటింగ్ చేస్తే సంజూ శాంసన్‌కు తిరుగుండదని చెప్పాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సంజూ శాంసన్ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

IND vs AFG: సంజూ శాంసన్ ఊచకోత.. భారత్ ఘన విజయం!

IND vs AFG: సంజూ శాంసన్ ఊచకోత.. భారత్ ఘన విజయం!

ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. తొలి 12 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన సంజూ.. ఆ తర్వాత పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకొని చెలరేగాడు. 20 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.

Sunil Gavaskar Reveals What Sanju Samson Must Do to Maintain Consistency highlights the key approach

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్.. సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ను కొనియాడాడు.'ఇప్పుడు సంజూ శాంసన్‌కు కావాల్సింది నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శన. 20 ఓవర్ల మ్యాచ్‌లో ఎక్కువ బంతులు ఎదుర్కొనే అరుదైన అవకాశం ఓపెనర్లకు మాత్రమే లభిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆడినట్లు సంజూ శాంసన్ క్రీజులో నిలదొక్కుకొని.. ఆడితే నిలకడగా 50, 60 పరుగులు చేయగలడు.

190, 200 పరుగుల వంటి కొండంత లక్ష్యాలను ఛేదించేటప్పుడు మాత్రమే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలి. కానీ సాధారణ లక్ష్యాలను ఛేదించేటప్పుడు అలా ఆడాల్సిన అవసరం లేదు. సంజూ శాంసన్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటానికి ప్రయత్నిస్తాడు. అందుకే చాలా మ్యాచ్‌ల్లో అతను కొన్ని పరుగులకే ఔటవుతాడు. అలా కాకుండా కాస్త ఓడికగా ఆడితే నిలకడగా రాణించగలడు.'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

Also Read

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో చివరి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాది మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు కనబర్చిన సంజూ శాంసన్ ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో తీవ్రంగా విఫలమయ్యాడు. తాజా హాఫ్ సెంచరీ అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.

Story first published: Wednesday, September 16, 2026, 21:10 [IST]
Other articles published on Sep 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+