For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ప్రపంచకప్‌లో ఓడాం.. సరైనోడు ఉంటే కథ వేరేలా ఉండేది: సునీల్ గావస్కర్

Sunil Gavaskar reveals one reason why India couldn’t win 2019 World Cup

న్యూఢిల్లీ: నాలుగో స్ఠానంలో సరైన బ్యాట్స్‌మన్‌ లేకపోవడం వల్లే గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌‌‌‌కప్‌లో టీమిండియా ఇంటిదారి పట్టిందని దిగ్గజ క్రికెటర్ సునీల్‌‌‌ ‌గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఆ స్థాన‌‌ంలో సరైన బ్యాట్స్‌మన్‌ ఉండుంటే కథ వేరేలా ఉండేదన్నాడు. ఇంగ్లండ్‌ వేదికగా గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌‌‌‌కప్‌లో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత్ సెమీఫైనల్‌‌‌‌ దాటలేకపోయింది. ఆ ఓటమి వెనుక కారణాలను సునీల్‌‌‌‌ గావస్కర్‌ ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలోతెలిపాడు.

నాలుగులో పొరపాటు..

నాలుగులో పొరపాటు..

వరల్డ్‌‌‌‌కప్‌లో టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ లీగ్‌‌‌‌ దశలో అదరగొట్టడంతో మిడిలార్డర్‌ కు పెద్దగా అవకాశం రాలేదు. దాంతో వారు సరిగా సెటిల్‌‌‌‌ అవ్వలేదు. దురదృష్టవశాత్తు నాకౌట్‌ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ దారుణంగా విఫలమైంది. అప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన 4,5,6 స్థానాల్లోని బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిని అధిగమించలేకపోయారు. నిజానికి మన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సత్తా ఉన్నవారే. టాపార్డర్లో కూడా ఆడగలరు. కానీ నాలుగో స్థానం విషయంలో పొరపాటు జరిగింది. ఆ స్థానంలో సరైన ప్లేయర్‌ ఉండుంటే వరల్డ్‌‌‌‌కప్‌లో కథ వేరేలా ఉండేది'అని సునీల్ గావస్కర్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత టీమ్ ది బెస్ట్..

ప్రస్తుత టీమ్ ది బెస్ట్..

గత జట్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియానే.. అత్యుత్తమ టెస్ట్ జట్టు అని సునీల్ గావస్కర్ అన్నాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకిగ్స్ లో నంబర్ వన్ తో పాటు.. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లోనూ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నది. ‘సమతూకం, నైపుణ్యం, దూకుడు పరంగా ఇప్పుడున్న టీమ్ ది బెస్ట్. గతంలో ఉన్న జట్లకు ఈ టీమ్‌కు అసలు పోలికే లేదు. కండీషన్స్, పిచ్‌లు ఎలా ఉన్నా విజయాలను అందించే బౌలర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్లో 1980 టీమ్ తో సమంగా ఉంది. కానీ ఇప్పటిలా బౌలర్లు అప్పుడు లేరు. 20 వికెట్లు తీసి మ్యాచ్ను గెలిపించే సత్తా ఇప్పటి బౌలర్లకు ఉంది'అని గావస్కర్ తెలిపారు.

రాయుడు ఉంటే..

రాయుడు ఉంటే..

గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో నాల్గో స్థానంపై తీవ్ర చర్చ నడిచింది. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడిని కాదని త్రీడైమెన్షన్స్(ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్) పేరిట తమిళనాడు క్రికెటర్ విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. తీరా అతను మధ్యలో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అయినా రాయుడికి చోటు దక్కలేదు. ఈ వ్యవహారంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అయితే నాటి ప్రపంచకప్ జట్టులో రాయుడు ఉంటే భారత్ విజయం సాధించేదనేది చాలా మంది అభిప్రాయం. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సురేశ్‌ రైనా కూడా ఈ విషయాన్నే వెళ్లడించాడు. అంబటి రాయుడు లేకపోవడంతోనే వరల్డ్‌కప్‌ను గెలవలేకపోయామన్నాడు.

వ్యూహాల లోపం..

వ్యూహాల లోపం..

ఇక టీమ్‌‌మేనేజ్‌మెంట్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మెగాటోర్నీ అనంతరం నాటి బ్యాటింగ్ కోచ్‌పై కూడా వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో జట్టు మేనేజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసిందని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. క్లిష్ట స్థితిలో ధోనీలాంటి అనుభవమైన ఆటగాడిని కాకుండా.. పంత్, పాండ్యా వంటి అనుభవంలేని ఆటగాళ్లు, పైగా దూకుడు కనబర్చేవారిని పంపించడం జట్టు ఓటమికి కారణమైందన్నారు. వారి స్థానాల్లో ధోనీని పంపిస్తే పరిస్థితులకు తగ్గట్లు యువ ఆటగాళ్లకు మార్గనిర్ధేశం చేస్తూ ఆడించేవాడన్నారు.

సాయానికి కోట్లు ఆర్జించిన సచిన్, కోహ్లీ రాలే.. పీపుల్ స్టార్ సోనూ సూద్ వచ్చాడు!

Story first published: Tuesday, August 25, 2020, 10:03 [IST]
Other articles published on Aug 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+