సాయానికి కోట్లు ఆర్జించిన సచిన్, కోహ్లీ రాలే.. పీపుల్ స్టార్ సోనూ సూద్ వచ్చాడు!

ముంబై: కరోనా కష్టకాలంలో దేవుడిలా ప్రతి ఒక్కరిని బాలీవుడ్ విలన్ సోనూ సూద్ ఆదుకుంటున్నారు. వలస కార్మికుల కష్టాలను చూసి చలించిపోయిన ఆయన వారందరికి ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి సొంత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురికి తన ఆపన్న హస్తాన్ని అందించారు. అలాగే సాయం కోరిన ప్రతీ ఒక్కరికి ఈ కష్టకాలంలో అండగా నిలుస్తూ రియల్ హీరోగా.. మెగా, సూపర్, పవర్ స్టార్‌లను తలదన్నేలా పీపుల్ స్టార్‌గా ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు. తెరపై విలన్‌లా కనిపించినా.. ఈ కరోనా కష్ట కాలంలో దేశప్రజలందరికి సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. అతను చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా ఓ బ్యాట్లు రిపేర్ చేసే వ్యక్తికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.

బ్యాట్ రిపేరర్ అష్రఫ్ భాయ్..
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల బ్యాట్లు రిపేర్ చేసిన ముంబైకి చెందిన అష్రఫ్ భాయ్ వాంఖడే పరిసిరాల్లో అందరికి సుపరిచితమే. ఆ మైదానంలో ఆడిన ప్రతీ ఒక్క ఆటగాడి బ్యాట్‌కు ఏ సమస్య వచ్చినా రిపేర్ చేసేది అష్రఫ్ భాయ్‌నే. భారత ఆటగాళ్లే కాదు.. ఇతర దేశాల ప్లేయర్ల బ్యాట్లకు రిపేర్ చేశాడు. అష్రఫ్ బ్రోస్ అనే బ్యాట్ల కంపెనీని కూడా అతను నడిపిస్తున్నాడు. విండీస్ బోర్డు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ జట్టుకు 16 బ్యాట్లు ఉచితంగా అందజేశాడు.

కరోనాతో ఆగం..
ఇక కరోనాతో క్రికెట్ ఆగిపోవడంతో అతను ఆర్థికంగా చితికిపోయాడు. మ్యాచ్‌ల్లేక బ్యాట్‌లను ఫిక్స్ చేయించుకోవడానకి, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికితోడు ఐపీఎల్ కూడా యూఏఈ తరలివెళ్లడంతో అతనికి పనిలేకుండా పోయింది. ఇంతలోనే అష్రఫ్ భాయ్ కిడ్నీ ఆపరేషన్‌కు డబ్బులు అవసరమయ్యాయి. అతని శ్రేయోభిలాషి జెఠ్మాలానీ రూ.2 లక్షలు ఏర్పాట్లు చేసిన అతని ఆఫరేషన్‌కు సరిపోలేదు. దీంతో దాతలు ముందుకు రావాలని జెఠ్మాలాని విజ్ఞప్తి చేశాడు. ఆష్రఫ్ భాయ్ ధీన గాథను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది.
క్రికెటర్లు ఆదుకోవాలి..
అష్రఫ్ భాయ్ సేవలను వినియోగించుకొని కోట్లు సంపాదించిన ఆటగాళ్లు అతనికి అండగా నిలవాలని జెఠ్మాలని క్రికెటర్లను కోరాడు. ‘అష్రఫ్ భాయ్ పరిస్థితి బాలేదు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కరోనా అతని వ్యాపారాన్ని దెబ్బతీసింది. అతని దగ్గర డబ్బులు లేవు. మేం రూ. 2 లక్షలు సర్దుబాటు చేసిన సరిపోలేదు. ఐపీఎల్ దుబాయ్‌కు తరలిపోవడంతో అతనికి పనిలేకుండా పోయింది. ఎంతో మంది ఆటగాళ్లు అతని సాయం తీసుకొని కోట్లు ఆర్చించారు. కానీ ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం విచారకరం. ఇప్పటికి అష్రఫ్ ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు. ఇప్పుడైనా ఏ క్రికెటర్ అయినా ఆదుకుంటాడనుకుంటున్నా'అని జెఠ్మాలాని ఆవేదన వ్యక్తం చేశాడు.

ముందుకు వచ్చిన సోనూసూద్..
అష్రఫ్ భాయ్ ధీనగాథను ఓ నెటిజన్ సోనూసూద్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన సూపర్ విలన్ స్పందించి అతడి అడ్రస్ అడిగాడు. సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అతని సేవలు వినియోగించుకొని కోట్లు ఆర్జించుకున్న క్రికెటర్లు ఎవరూ అష్రఫ్‌ను పట్టించుకోకపోయినా.. సోనూసూద్ ముందుకు రావడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ కర్ణుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
బీజేపీలోకి సౌరవ్ గంగూలీ.? అందుకేనా అలా చేసింది?