జోఫ్రా ఆర్చర్ ఏంటి ఈ పక్షపాతం? మీ కెప్టెన్ అనే కదా?.. సునీల్ గవాస్కర్ ఫైర్!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్స్ జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్‌పై భారత క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఇద్దరు బౌలర్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్, ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు ఆర్చర్, కరన్ ఒక్క బౌన్సర్ కూడా సంధించలేదన్నాడు. హిందీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గవాస్కర్.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ సందేహాన్ని లేవనెత్తాడు.

ముద్దుగా ఫుల్‌టాస్..
కోల్‌కతా ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో క్రీజులో ఉన్న ఇయాన్ మోర్గాన్‌కు టామ్ కరన్ ఫుల్ టాస్ వేసాడు. దీంతో అతను బంతిని బౌండరీకి తరలించాడు. ఇది చూసి బిత్తరపోయిన గవాస్కర్ టామ్ కరన్ తీరును తప్పబట్టాడు. ‘ముద్దుగా ఫుల్ టాస్ వేసిన తమ కెప్టెన్‌కు భారీ షాట్ ఆడమని చెప్పినట్లుగా ఉంది కరన్ బౌలింగ్ తీరు.'అని గవాస్కర్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.

ఒక్క బౌన్సర్ లేదు..
అంతకుముందు జోఫ్రా ఆర్చర్ తన కెప్టెన్ మోర్గాన్‌కు ఒక్క బౌన్సర్ కూడా వేయలేదన్నాడు. ‘ఇయాన్ మోర్గాన్‌కు మ్యాచ్‌లో కనీసం ఒక్క బౌన్సర్‌ను కూడా జోప్రా ఆర్చర్ సంధించలేదు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న ఆర్చర్ నుంచి నేను దీన్ని ఏమాత్రం ఊహించలేదు. 'అని సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక గవాస్కర్ చేసిన ఆరోపణలతో అభిమానులు నిజమే.. ఇంగ్లండ్ ఆటగాళ్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల తీరు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.

కోల్‘ఖాతా'లో మరొకటి..
ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ 37 పరుగులతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ 47), ఇయాన్ మోర్గాన్ (23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 34 నాటౌట్) రాణించారు. జోఫ్రా ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసి ఓడింది. టామ్ కరన్ (36 బంతుల్లో2 ఫోర్లు, 3 సిక్స్‌లు 54 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. శివమ్ మావికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
ఓ ఐసీసీ.. ఇదేం డీఆర్‌ఎస్ రూల్? ఎట్టెట్టా.. ఆ సింగిల్ కౌంట్ కాదు? ఇంత అన్యాయమా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications