
ఆఖరి టెస్టులో ఆసీస్ ఓడినా లేక సిరీస్ డ్రా అయినా
ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో ఆసీస్ ఓడినా లేక సిరీస్ డ్రా అయినా గత యాషెస్‌లో ఆస్ట్రేలియా విజేత కాబట్టి ట్రోఫీ దాని దగ్గరే ఉంటుంది. ఆఖరి టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తే టిమ్ ఫైన్ సేన అరుదైన ఘనత సాధిస్తుంది. 2001లో మార్క్ వా తర్వాత యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు తెచ్చిన మొట్టమొదటి కెప్టెన్‌గా టిమ్ పైన్ చరిత్ర సష్టిస్తాడు.

స్మిత్ అద్భుత ప్రదర్శనపై
ఈ సిరిస్‌లో స్మిత్ అద్భుత ప్రదర్శనపై ప్రతి క్రికెట్ అభిమాని పొగడ్తలతో ప్రశంసల వర్షం కురిపిస్తుంటే... ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ మాత్రం తీవ్రంగా విమర్శించాడు. స్టీవ్ స్మిత్ తన అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా జట్టుకు అద్భుత విజాయాలను అందించినా... బాల్ టాంపరింగ్ ఉదంతంలో అతడి పాత్ర ఉందని ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నాడు.
యాషెస్ ట్రోఫీని నిలుపుకున్న ఆనందంలో మైదానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల అతి (వీడియో)

స్మిత్ ఒక మోసగాడు
"స్టీవ్ స్మిత్ ఒక మోసగాడు. అతడిని మీరు ఎప్పటికీ క్షమించలేరు. స్టీవ్ స్మిత్ ఏమి చేసినా, దక్షిణాఫ్రికాలో ఏమి జరిగిందో అతనికి ఎప్పుడూ గుర్తుండి పోతుంది. ఆ విషయంతో అతడు జీవించాల్సి ఉంటుంది. స్మిత్, బాన్‌క్రాఫ్ట్ లేదా వార్నర్‌పై ఎవరి అభిప్రాయాన్ని నేను చూడలేను. ఎందుకంటే వారు ఆటను దెబ్బతీశారు" అని హార్మిసన్ అన్నాడు.

కేప్ టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్
గతేడాది సఫారీ పర్యటనలో భాగంగా కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలలు నిషేధం విధించింది.
రబడ అసంతృప్తి: మీడియా కొంతమంది ఆటగాళ్లను మాత్రమే హైప్ చేస్తోంది

యాషెస్ సిరిస్‌లో అద్భుతమైన ఫామ్‌లో
నిషేధం అనంతరం నేరుగా యాషెస్ సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్నాడు. ముఖ్యంగా ఈ సిరిస్‌లో ఇప్పటికే 134.2 యావరేజితో ఏకంగా 671 పరుగులు చేశాడు. ఆదివారంతో ముగిసిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 82 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications












