ఈ పాటను ఆలపించే సమయంలో
ఈ పాటను ఆలపించే సమయంలో ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది అందరూ రౌండ్‌గా నుంచుని ఒకరి చేతులు మరొకరు పట్టుకుని డ్యాన్స్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఖరి టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తే టిమ్ ఫైన్ సేన అరుదైన ఘనత సాధిస్తుంది. 2001లో మార్క్ వా తర్వాత యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు తెచ్చిన మొట్టమొదటి కెప్టెన్‌గా టిమ్ పైన్ చరిత్ర సష్టిస్తాడు.

ఉత్కంఠ రేపిన నాలుగో టెస్టు
ఉత్కంఠ రేపిన నాలుగో టెస్టులో డ్రా కోసం ఇంగ్లాండ్ గట్టిగానే పోరాడినప్పటికీ చివరకు ఓటమి తప్పలేదు. పేసర్లు పాట్ కమిన్స్ (4/43), హాజెల్‌వుడ్ (2/31) రాణించడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 197 పరుగులకే అలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 18/2 వద్ద ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. ఉదయం కమిన్స్, హాజెల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనేందుకు జో డెన్లీ, జేసన్ రాయ్ ఇబ్బంది పడ్డారు. డెన్లీ అయితే రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు రాయ్ డిఫెన్స్ ఆడడంతో తొలి గంట వికెట్ కోల్పోకుండా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కొనసాగించింది.

అంపైర్ అవుటివ్వకుండానే
ఇక క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన రాయ్ (31)ను ఓ అద్భుత బంతితో కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఐదు ఓవర్ల తర్వాత ఆటగాడు బెన్ స్టోక్స్ (1)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ పైన్ డైవ్ చేసి అందుకున్నాడు. అయితే అంపైర్ అవుటివ్వకుండానే స్టోక్స్ క్రీజును వదిలి వెళ్లిపోయాడు. దీంతో 87/4తో ఇంగ్లండ్ లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన డెన్లీ (53).. అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ కొద్దిసేపటికే స్పిన్నర్ లియాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి నిష్క్రమించాడు.

పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు
ఈ దశలో బట్లర్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. ఇదే సమయంలో స్టార్క్ ఓ ఫుల్‌లెంగ్త్ డెలివరీతో బెయిర్ స్టోను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫీల్డ్‌అంపైర్ అవుటివ్వగా.. బెయిర్ స్టో (61 బంతుల్లో 25) సమీక్షకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో 45 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఇక టీ విరామానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లకు 166 పరుగులు చేసింది. టీ విరామం తర్వాత బట్లర్ (111 బంతుల్లో 34), ఆర్చర్ (1) వెనుదిరిగినా.. లోయరార్డర్‌లో ఓవర్టన్ (105 బంతుల్లో 21), లీచ్ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు.

మ్యాచ్ ‘డ్రా' అయ్యేలా
ఈ దశలో మ్యాచ్ ‘డ్రా' అయ్యేలా కనిపించింది. అయితే లీచ్‌ను పార్ట్‌టైమర్ లబషేన్, ఓవర్టన్‌ను హాజల్‌వుడ్ పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 497/8 వద్ద డిక్లేర్ చేయగా.. ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆటౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 186/6 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో విలువైన అర్ధసెంచరీ సాధించిన స్మిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.


Click it and Unblock the Notifications












