
రెండు తప్పిదాలు చేశా..
తన తప్పుడు నిర్ణయాలతోనే భారత్ నాటి మ్యాచ్‌లో ఓడిందన్నాడు. తాజాగా మిడ్‌డే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బక్నర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను చేసిన ఈ ఘోర తప్పిదాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని తెలిపాడు. ‘2008లో జరిగిన సిడ్నీటెస్ట్‌లో నేను రెండు తప్పిదాలు చేశాను. మొదటిది భారత్ పటిష్టంగా ఉన్న స్థితిలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సెంచరీ చేసేలా చేశాను. రెండోది టెస్ట్ చివరి రోజు చేశాను. ఇది భారత ఓటమికి కారణమైంది. ఇలా ఐదు రోజుల్లో రెండు తప్పిదాలు చేసిన తొలి అంపైర్ నేనేనా? అని ఇప్పటికి నన్ను వెంటాడుతుంది.'అని బక్నర్ తెలిపాడు.

సైమండ్స్ ఔటైనా..
ఇక ఈ వెస్టిండీస్ అంపైర్ ఆట తొలి రోజు తన తప్పుడు నిర్ణయంతో ఆండ్రూ సైమండ్స్‌కు లైఫ్ ఇచ్చాడు. భారత బౌలర్ల ధాటికీ 135 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను సైమండ్స్, బ్రాడ్ హగ్ గట్టెక్కించారు. అయితే 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సైమండ్స్‌ను ఇషాంత్ శర్మ ఔట్ చేయగా.. అంపైర్‌గా ఉన్న స్టీవ్ బక్నర్ నాటౌట్ ఇచ్చాడు. బంతి సైమండ్స్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు టీవీ కెమెరాల్లో స్పష్టమైంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంటుంది. ఇక ఈ లైఫ్‌తో చెలరేగిన సైమండ్స్ 160 రన్స్‌తో ఆసీస్ 463 పరుగులు చేసేలా చేశాడు.

ద్రవిడ్ ఔట్ కాకున్నా..
ఇక అనంతరం భారత్ సచిన్, లక్ష్మణ్ సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల లీడ్ అందుకుంది. అనంతర రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 401 రన్స్ చేసి ఆఖరి రోజు భారత్ ముందు 333 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారత్‌కు సరైన ఆరంభం లభించకపోవడంతో గంగూలీ, ద్రవిడ్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ సైమండ్స్ బౌలింగ్‌లో బంతి ద్రవిడ్ బ్యాట్‌కు తగలకుండానే స్టీవ్ బక్నర్ ఔటిచ్చాడు. టీవీ కెమెరాల్లో బంతి ద్రవిడ్ ప్యాడ్‌లను తాకినట్లు స్పష్టమైంది. ఈ వికెట్ అనంతరం ధోనీ-కుంబ్లే అద్భుత పోరాటంతో జట్టును విజయం దిశగా నడిపించారు. కానీ ధోనీ ఔట్‌తో సీన్ రివర్స్ అయింది. భారత బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 122 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

సాకులు చెప్పడం లేదు..
అయితే అంపైర్ల తప్పిదం గురించి ప్రేక్షకులు తెలియదని, మైదానంలో వీచే గాలి ద్వారా ఇలాంటివి జరుగుతాయని స్టీవ్ బక్నర్ అన్నాడు. ‘అసలు తప్పిదాలు ఎందుకు జరుగుతాయో మీ అందరికి తెలియాలి. నేనేం సాకులు చెప్పడం లేదు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ పునరావృతం కావద్దని మీరందరూ కోరుకుంటారు. కానీ బౌలింగ్ చేసేటప్పుడు బంతితో పాటు వచ్చే గాలితో సౌండ్ వస్తుంది. కామెంటేటర్స్ స్టంప్ మైక్ ద్వారా బంతి బ్యాట్‌కు తాకింది లేదా? అని వింటారు. కానీ అంపైర్లకు ఆ విషయంలో స్పష్టత ఉండదు. ఇదంతా ప్రేక్షకులకు తెలియదు'అని బక్నర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications

గంభీర్‌పై మరోసారి నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రిది!










