
రైనా ఉంటే..
‘చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. సురేశ్ రైనా, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌లో వారి స్థానాలను భర్తీ చేసేందుకు వివిధ రకాల కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాం. కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. అయినా ఓటమి తప్పడం లేదు. నిజంగా సురేశ్ రైనా టోర్నీకి దూరమవ్వడం బాధాకరం.. అతను నిన్నటి మ్యాచ్‌లో ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తట్టుకొని నిలకడగా ఆడుతూ బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.

మా స్పిన్నర్లు తేలిపోయారు..
'బౌలింగ్ విషయానికి వస్తే.. మా జట్టు స్పిన్ విభాగం మరింత బలహీనంగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా.. పరుగులను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. మేం ఆడిన మూడు మ్యాచ్‌లు మూడు మైదానాల్లో జరగడంతో స్పిన్నర్లు తడబాటుకు గురయ్యారు. పిచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ వ్యూహా లను రచించడం కష్టమైంది. ఇది మాకు లాభం చేకూర్చే విషయమే. ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలోనే మూడు వేదికలపైన అవగాహన వచ్చింది. ఇక ముందు పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ వ్యూహాలను రచిస్తాం. పేస్ బౌలింగ్‌లో కూడా ఒక అంచనాకు వచ్చాం. రానున్న మ్యాచ్‌ల్లో వీటిపై దృష్టి సారిస్తూ.. తప్పులను సరిచేసుకుంటాం.'అని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.

ధోనీ కూడా..
ఇక ధోనీ కూడా రాయుడు లేకపోవడంతోనే జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బ్యాలెన్స్ తప్పిందన్నాడు. అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని, అప్పుడు పరిస్థితులు అన్నీ సరిదిద్దుకుంటాయన్నాడు. 'అంబటి రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్ ఆర్డర్ బ్యాలెన్స్ తప్పింది. ఇది మాకు మంచి మ్యాచ్ అనుకోవడం లేదు. డ్యూ ప్రభావం లేనప్పటికీ వికెట్ నెమ్మదించింది. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడంతో రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది. మేం పుంజుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

స్పూర్తిదాయకమైన ఆటతో..
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 ) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్ ), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (35 బంతుల్లో 4 ఫోర్లు 43) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడా 3 వికెట్లు పడగొట్టాడు.
KKR vs SRH ప్రివ్యూ: మెరిసేదెవరో? బోణీ కొట్టేదెవరో? తుది జట్లు ఇవే!


Click it and Unblock the Notifications












