For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs SRH ప్రివ్యూ: మెరిసేదెవరో? బోణీ కొట్టేదెవరో? తుది జట్లు ఇవే!

KKR vs SRH: Who will win Kolkata Knight Riders vs Sunrisers Hyderabad?
IPL 2020 : KKR vs SRH Preview, Kolkata, Hyderabad Look For First Win || Oneindia Telugu

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌ను ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో సవాల్‌కు రెడీ అయ్యాయి. శనివారం అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో పోటీ పడనున్న ఈ రెండు జట్లు టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి. అంతగా అనుభవం లేని మిడిలార్డర్‌తో బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని హైదరాబాద్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో ఓటమి చవిచూడగా.. ముంబై చేతిలో దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ పరాజయం పాలైంది.

ఓ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంటే.. మరో జట్టు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు రసవత్తరంగా ఉండనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ ప్రకారం కేకేఆర్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 17 సార్లు తలపడగా 10-7తో కోల్‌కతా లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని కేకేఆర్ భావిస్తుండగా.. గెలుపుతో లెక్క సరిచేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

 డేవిడ్ వార్నర్‌పైనే అందరి ఆశలు..

డేవిడ్ వార్నర్‌పైనే అందరి ఆశలు..

గత మ్యాచ్‌లో మిడిలార్డర్ వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి ఐదు ఓవర్లలో 43 రన్స్ చేయలేక ఓటమికి తల వంచింది. 32 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి విజయం ముంగిట బొక్కబోర్లా పడింది. మిచెల్ మార్ష్ గాయం కూడా ఆరెంజ్ ఆర్మీనీ దెబ్బతీసింది. ఇప్పుడు అతని సేవలను పూర్తిగా కోల్పోయిన హైదరాబాద్ విజయాల బాట పట్టాలంటే కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన అతను ఈ సారి బ్యాట్ ఝుళిపించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో‌తో పాటు మనీశ్ పాండే ఫామ్‌లో ఉండడం ప్లస్ పాయింట్. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగితే బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది. అతను వన్‌డౌన్‌లో వస్తే మనీశ్ నాలుగో నంబర్‌లో దిగొచ్చు. అప్పుడు మిడిల్ కూడా స్ట్రాంగ్ కానుంది. ఇక సన్‌రైజర్స్ బౌలింగ్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌తో పాటు అఫ్గాన్ మరో స్పిన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ బరిలోకి దిగొచ్చు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో తమ కోటా పూర్తి చేసుకున్న కీలక బౌలర్లు రషీద్‌ ఖాన్, భువనేశ్వర్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం. సందీప్‌ శర్మ, నటరాజన్‌ పరవాలేదనిపించారు. మొత్తంగా చూస్తే తొలి మ్యాచ్‌లో రైజర్స్‌ తడబాటు స్పష్టంగా కనిపించింది. ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తిరుగుండదు.

 కార్తీక్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష..

కార్తీక్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష..

ఈసారి పలువురు స్టార్ ఆటగాళ్లను తీసుకొని స్ట్రాంగ్ టీమ్‌గా కనిపించిన కేకేఆర్ తొలి పోరులో కెప్టెన్ దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ నిర్ణయాలు బెడిసి కొట్టాయి. గత సీజన్‌లో భీకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఆండ్రూ రసెల్‌ను ఆరో నంబర్‌లో పంపించి విమర్శలపాలయ్యాడు. ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మోర్గాన్ కూడా ఐదో నెంబర్‌లో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఈ పోరులో కార్తీక్ కెప్టెన్సీకి మరోసారి పరీక్ష ఎదురుకానుంది. ముంబైతో తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు సరిదిద్దుకునేందుకు కార్తీక్‌కు ఇదే మంచి అవకాశం. మ్యాచ్‌ తమ చేజారక ముందే భీకర హిట్టింగ్‌ చేసే రసెల్‌తో పాటు ఇయాన్‌ మోర్గాన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పైకి తీసుకువస్తే కోల్‌కతాకు అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లోనూ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను సరిగ్గా వాడుకోకపోవడం ప్రత్యర్థికి కలిసొచ్చింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న కమిన్స్‌ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఈ లోపాలను సవరించుకోవడంతో పాటు ఆత్మరక్షణ ధోరణితో కాకుండా దూకుడుగా ఆడితే కోల్‌కతా మెరవడం ఖాయం. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

తుది జట్లు

తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, శుభమన్ గిల్, దినేశ్ కార్తీక్(కీపర్, కెప్టెన్), నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, నిఖిల్ నాయక్/రాహుల్ త్రిపాఠి, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, సందీప్ వారియర్

సన్ రైజర్స్ హైదరాబాద్: జానీ బెయిర్‌స్టో(కీపర్), డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్/మహ్మద్ నబీ, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్/ఖలీల్ అహ్మద్

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

స్పిన్‌కు అనుకూలం. డ్యూ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగానే గత 7 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు. ఓపికగా క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్స్ చేయవచ్చు. గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అలానే సక్సెస్ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

CSK vs DC Trolls: ధోనీ భయ్యా.. నీ నుంచి కాదు గానీ, కరోనా వచ్చిందని భారత్‌కు వచ్చేయ్!

Story first published: Saturday, September 26, 2020, 12:02 [IST]
Other articles published on Sep 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+