Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fact Check: సచిన్ డబుల్ సెంచరీపై స్టెయిన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు.!

Stats Show Dale Steyn lied about getting close to dismissing Sachin Tendulkar in 190s Before Scoring 1st ODI 200

హైదరాబాద్: అంపైర్ తప్పిదం వల్లనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడని సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత దిగ్గజం 190 ప్లస్ స్కోర్ వద్ద తన బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడని, కానీ అప్పటి ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షక సమూహాన్ని చూసి భయపడి ఔటివ్వలేదన్నాడు. తనకు ఏమీ అర్థంకాక గౌల్డ్ వైపు చూశానని, అప్పుడు అతడి ముఖంలో భయం కనపడిందని ఈ సఫారీ పేసర్ చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకులకు భయపడి..

ప్రేక్షకులకు భయపడి..

‘నేనేమో.. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు? అనే ఉద్దేశంతో అతడి వైపు చూశా. అంపైరేమో.. చుట్టూ జనాలను చూశావా.. సచిన్‌ను ఔట్ ఇస్తే ఇక్కడి నుంచి హోటల్‌కు కూడా నన్ను వెళ్లనివ్వరు.. అనేలా నా వైపు దీనంగా చూశాడు' అని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో తాజాగా నిర్వహించిన లైవ్ సెషన్‌లో స్టేయిన్ అన్నాడు.

పచ్చి అబద్దం..

పచ్చి అబద్దం..

అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన నాటి మ్యాచ్ గణంకాలను పరిశీలిస్తే స్టెయిన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని తేటతెల్లమైంది. ఆ మ్యాచ్‌లో 147 బంతుల్లో సచిన్ 200 పరుగులతో అజేయంగా నిలిచి వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. అయితే మాస్టర్ ఎదుర్కొన్న 147 బంతుల్లో స్టెయిన్ వేసినవి 31 బాల్స్ కాగా.. ఈ 31 బంతుల్లో ఒక్క క్లోజ్డ్ ఎల్బీడబ్ల్యూ కాల్ రాలేదు.

సచిన్ ఆడింది మూడు బంతులే..

సచిన్ ఆడింది మూడు బంతులే..

ఇక 190 ప్లస్ స్కోర్ వద్ద సచిన్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడని సఫారీ పేసర్ పేర్కొన్నాడు. కానీ.. సచిన్ 190లోకి వచ్చిన తర్వాత స్టెయిన్ వేసిందే కేవలం రెండు ఓవర్లు (47, 49 ఓవర్లు) మాత్రమే. ఈ 12 బంతుల్లో మాస్టర్ ఎదుర్కొంది కూడా మూడు బంతులే. అది కూడా 47 ఓవర్లోనే ఆ మూడు బంతులు ఆడి రెండు సింగిల్స్ తీసాడు. ఇందులో ఏ ఒక్కటి ఎల్బీ డబ్ల్యూకు అప్పీల్‌ చేసిన దాఖలాలు లేవు.

దీన్ని బట్టి చూస్తే స్టెయిన్ ఇతర మ్యాచ్‌లో జరిగింది, ఈ మ్యాచ్ అనుకొని పొరబడి ఉండాలి లేక.. మరే ఉద్దేశంతోనైనా ఈ వ్యాఖ్యలు చేసి ఉండాలి. కానీ అంపైర్ తప్పిదం వల్ల డబుల్ సెంచరీ అనేది మాత్రం 100 శాతం తప్పుడు వ్యాఖ్యలే. ఇక ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన స్టెయిన్ దారుణంగా 89 పరుగులు సమర్పించుకున్నాడు.

రోహిత్ భాయ్.. తిట్టని తిట్టూ తిట్టారు: బంగ్లాదేశ్ క్రికెటర్

Story first published: Sunday, May 17, 2020, 17:54 [IST]
Other articles published on May 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+