Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్క ఓవర్ అంతా మార్చేసింది: లంక ఓటమిపై కోచ్

Sri Lankan Players Haven't Learnt From Mistakes: Nic Pothas

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్‌ని శ్రీలంక చేజార్చుకుందని ఆ జట్టు ప్రధాన కోచ్ నిక్ పోథస్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 215 పరుగులకే ఆలౌటైంది.

విశాఖ వన్డేలో ధావన్ సెంచరీ: 2-0తో సిరిస్ భారత్ కైవసం

అనంతరం 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 32.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ని 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ విజయం టీమిండియాకు వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం.

మ్యాచ్ అనంతరం శ్రీలంక జట్టు కోచ్ నిక్ పోథిస్ మీడియాతో మాట్లాడుతూ 'మ్యాచ్‌లో 28వ ఓవర్‌ వరకూ శ్రీలంక జట్టు అద్బుతంగా ఆడింది. కానీ.. ఒకే ఓవర్‌లోనే తరంగ, డిక్వెల్లా రూపంలో కీలక వికెట్లు చేజార్చుకోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది' అని పేర్కొన్నాడు.

'ఆ తర్వాత నుంచి పుంజుకోవడం జట్టుకి కష్టంగా మారింది. మా స్ట్రాటజీ మాకుంది. జట్టులో స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్లను ఉండాలనుకున్నాం. భారత్‌ గడ్డపై మ్యాచ్‌లు ఆడేటప్పుడు.. మిడిలార్డర్‌లో స్పిన్‌ని ఎదుర్కొనే ఆటగాళ్లు జట్టులో తప్పకుండా ఉండాలనేది అందరికీ తెలిసిందే' అని అన్నాడు.

4000 పరుగులు: విశాఖ వన్డేలో ధావన్‌ అరుదైన ఘనత

'నిజానికి తరంగ, డిక్వెల్లా ఇద్దరూ స్పిన్నర్లు ధీటుగా ఎదుర్కొనేవారే. అలా ఆడగలిగే సామర్థం ఉన్న వారే.. ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేరడంతో జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింది. వన్డే సిరీస్‌లో చేసిన తప్పిదాల్ని మళ్లీ.. మళ్లీ లంక ఆటగాళ్లు చేయడంతో‌నే మ్యాచ్‌ చేజారింది' అని కోచ్ పోథిస్ పేర్కొన్నాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే ఓపెనర్ ఉపుల్ తరంగ (95) దూకుడగా ఆడటంతో 27 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 160/2 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఈ సమయంలో 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్‌ శ్రీలంకను ఘోరంగా దెబ్బతీశాడు.

ఆ ఓవర్‌ మొదటి బంతికే సెంచరీ దిశగా సాగుతున్న ఉపుల్ తరంగ ఔటవగా.. ఐదో బంతికి డిక్వెల్లా (8) స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం శ్రీలంక జట్టు ఒక్కసారిగా ఒత్తిడిలో పడి మిగతా వికెట్లను తక్కువ పరుగులకే కోల్పోయి సిరిస్‌ను చేజార్చుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 14:55 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+